ETV Bharat / international

కరోనా 2.0: చైనాలో మళ్లీ పెరిగిన కేసులు - asymptomatic cases in china

చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 51 కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 వరకు లక్షణాలు బయటపడని కేసులే. వీటిలో కరోనా పుట్టిల్లు వూహాన్​లోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం.

China reports 51 new coronavirus cases, mostly in Wuhan
చైనాలో కొత్తగా 51 కరోనా కేసులు
author img

By

Published : May 25, 2020, 12:19 PM IST

చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్-19 రెండో దశలో కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 వరకు రోగ లక్షణాలు లేని కేసులు. కరోనా వైరస్ పుట్టిందని భావిస్తున్న వుహాన్​లోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్​హెచ్​సీ) తెలిపింది. వుహాన్​లో గత 10 రోజుల్లో 60 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.

ఎన్​హెచ్​సీ ప్రకారం... విదేశాల నుంచి చైనాకు వచ్చిన స్వదేశీయుల్లో 11 మందికి కరోనా పాజిటివ్​ ఉన్నట్లు గుర్తించారు.

వుహాన్​లో మళ్లీ విజృంభణ

కొత్తగా గుర్తించిన 40 ఎసింప్టొమాటిక్​ కేసుల్లో 38 వుహాన్​లోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తమైన ఆరోగ్యశాఖ చాలా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 11.2 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు జరిపింది.

చైనాలో 396 ఎసింప్టొమాటిక్​ కేసులుంటే.. వాటిలో 326 వుహాన్​లో నమోదు కావడం గమనార్హం.

ఎసింప్టొమాటిక్​ రోగులకు కొవిడ్​-19 టెస్టుల్లో పాజిటివ్ అని నిర్ధరణ అయినప్పటికీ... వారిలో రోగ లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉండవు.

న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్

చైనాలో కరోనా నియంత్రణ కోసం న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇది ఓ పరమాణు సాంకేతికత. దీని ద్వారా రక్తదాతల నుంచి కరోనా వైరస్ ఇతరులకు సంక్రమణ జరగకుండా ఆపే అవకాశం ఏర్పడుతుంది.

ఎన్​హెచ్​సీ ప్రకారం... ఇప్పటి వరకు చైనాలో 82,985 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 4,634 మంది మరణించారు.

ఇదీ చూడండి: భూకంపాన్నే లెక్కచేయని ప్రధాని.. యథావిధిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.