కరోనా వైరస్ వివరాలను తెలపటంలో పారదర్శకంగా వ్యవరించటం లేదన్న అమెరికా ఆరోపణలను ఖండించింది చైనా. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.
"ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం కరోనా వ్యాధిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలసి చైనా పని చేస్తోంది. అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల వైద్యాధికారులు వ్యాధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తూనే ఉన్నారు. చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమంలో భాగంగా అమెరికా సహా వివిధ దేశాలకు చెందినవారిని ఆహ్వానిస్తున్నాం."
-జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
కరోనా ధాటికి చైనాలో ఇప్పటివరకు 1500 మందికి పైగా మృతి చెందగా, మరో దాదాపు 65 వేల మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన 15 మందితో కలిపి 505 మంది విదేశీయులకు వైరస్ సోకినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 23 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్