భారత్తో తరచూ కయ్యానికి కాలు దువ్వే చైనా.. ఇప్పుడు ప్రశంసలు కురిపించింది. బ్రిక్స్కు (BRICS Summit 2021) అధ్యక్షత వహిస్తూ ఈ ఏడాది కాలంలో భారత్ చేసిన కృషిని గుర్తిస్తున్నామని, అందుకు ప్రశంసిస్తున్నామని చైనా పేర్కొంది. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి (BRICS Summit) సాధించిన అభివృద్ధిపై స్పందిస్తూ చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురవారం వర్చువల్‌గా జరిగిన 13వ బ్రిక్స్ దేశాల సమావేశంలో (BRICS Summit 2021) చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అఫ్గాన్ సంక్షోభంతో(Afghanistan Crisis) పాటు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
వచ్చే ఏడాది జరగనున్న 14వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజారోగ్యం, టీకాలు, ఆర్థిక రంగంలో ఉమ్మడి ప్రయోజనం, రాజకీయ, భద్రత రంగాలు, అధ్యయనం కోసం ప్రజల మధ్య సహకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
ఇదీ చూడండి : BRICS Summit 2021: అఫ్గాన్ 'ఉగ్ర అడ్డా' కాకూడదు.. బ్రిక్స్ పిలుపు