ETV Bharat / international

'వుహాన్​ లాక్​డౌన్'​ విలువ 7 లక్షల ప్రాణాలు! - Covid-19 latest updates

కరోనా కట్టడికి వుహాన్​ను దిగ్బంధించింది చైనా ప్రభుత్వం. ఈ నిర్ణయం కారణంగా దాదాపు 7లక్షలకు పైగా కేసులు నమోదు కాకుండా అడ్డుకోగలిగినట్లు పరిశోధనలు వెల్లడించాయి.

China lockdown
వుహాన్​ లాక్​డౌన్​ కారణంగా తగ్గిన లక్షల కరోనా కేసులు!
author img

By

Published : Apr 1, 2020, 1:21 PM IST

లాక్​డౌన్​ వంటి కఠిన చర్యల అమలు ద్వారా 7 లక్షల మందికిపైగా కరోనా సోకకుండా చైనా ప్రభుత్వం అడ్డుకోగలిగిందని ఓ అధ్యయనంలో తేలింది. ఆక్స్​ఫర్డ్​కు చెందిన పరిశోధకులు ఇందుకు సంబంధించిన నివేదికను చైనా, అమెరికా బ్రిటన్​లోని జర్నల్స్​లో ప్రచురించారు.

కరోనా మహమ్మారి పుట్టి 50 రోజులైనప్పటికీ ఫిబ్రవరి 19 నాటికి కేసుల సంఖ్య 30,000వేలుగా ఉందని పరిశోధకులు తెలిపారు. వుహాన్​లో లాక్​డౌన్, ప్రయాణాల నిషేధం వంటి ఆంక్షలను విధించకపోయి ఉంటే 7 లక్షల కొత్త కేసులు నమోదై ఉండేవని అంచనా వేశారు. చైనా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలొచ్చాయని విశ్లేషించారు.

కేసుల నివేదికలు, ప్రజారోగ్య వివరాలు, మొబైల్​ ఫోన్​ లొకేషన్ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం జరిపారు పరిశోధకులు. చైనా అతిపెద్ద పండగలైన స్ప్రింగ్ ఫెస్టివల్, లూనార్ న్యూ ఇయర్​ సమయాల్లో గత రెండెల్లో వుహాన్​ ప్రజలు చేసిన ప్రయాణాల ఆధారంగా ఈ వివరాలను అంచనా వేశారు.

వుహాన్​లో ప్రయాణ ఆంక్షలు విధించిన కారణంగా చైనాలోని ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపించకుండా నిలువరించారని పరిశోధన పేర్కొంది. వుహాన్​ ఆంక్షలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడం ద్వారా వైరస్​ను నియంత్రించారని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.