తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించుకునేందుకు భారత్-చైనా పరస్పరం లోతైన చర్చలు జరుపుతున్నాయని, సమన్వయంతో ఉన్నాయని చైనా మిలిటరీ పేర్కొంది. కార్ఫ్స్ కమాండర్స్ 8వ విడత సమావేశాల అనంతరం ఇది మరింత ధృడ పడిందని వెల్లడించింది.
"8 వ రౌండ్ కార్ఫ్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినప్పటి నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు యథావిధిగా ఉన్నాయి" అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రెన్ గోకియాంగ్ మీడియా సమావేశంలో వివరించారు.
భారత సైన్యంతో చర్చలు కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఇరు దేశాలు కలిసి సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులేయాలని రెన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చైనా దురాక్రమణలపై జపాన్ నిరసన