ETV Bharat / international

చైనాకు డెల్టా భయం- పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్​డౌన్​

చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు(China covidcases) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు టెస్టుల సంఖ్యను పెంచాయి. వైరస్​ వ్యాప్తిని(Corona Pandemic) అరికట్టేందుకు మళ్లీ లాక్​డౌన్​లను అమలు చేస్తున్నాయి.

China imposes local lockdowns
చైనాలో వైరస్​ వ్యాప్తి
author img

By

Published : Sep 15, 2021, 12:43 PM IST

చైనాలో కరోనా వైరస్​ కేసులు(China covidcases) అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు తూర్పు తీరం వెంబడి రాష్ట్రాల్లో లాక్​డౌన్​లు విధించడం సహా పెద్ద సంఖ్యలో టెస్ట్​లు చేస్తోంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుటియన్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలోనే కరోనా హాట్​స్పాట్​ ప్రాంతాలను అధికారులు పూర్తిగా మూసివేశారు. పుటియన్ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్​ బుధవారం తెలిపింది.

జియోమెన్​, క్వాన్​జౌలలో డెల్టా వేరియంట్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అక్కడి అధికారులు. 2019లో వైరస్​ మొదట వెలుగు చూసిన వెంటనే.. మధ్య చైనాలోని ఆయా నగరాల్లో తగు చర్యలు చేపట్టిన చైనా ప్రస్తుతం కూడా అలాంటి చర్యలనే అనుసరిస్తోంది. అయితే ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్​ ప్రాంతంలో 152 కేసులు వెలుగు చూశాయి.

  • దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.
  • పర్యటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, జిమ్​లపై కఠిన ఆంక్షలు విధించింది.
  • ప్రజలు సమూహంగా చేరే ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు కొనసాగిస్తోంది.

కరోనా వైరస్​ను సమర్థంగా ఎదుర్కొన్న చైనా.. కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్ల వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది.

ఇదీ చూడండి: 'చైనాపై దాడికి సిద్ధమైన ట్రంప్​- వణికిపోయిన ఆ అధికారి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.