కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కేంద్రస్థానమైన చైనాపై ఆరోపణలు చేస్తూ.. చర్యలు చేపడుతున్న అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగింది డ్రాగన్. అమెరికాకు చెందిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వీసాలపై ఆంక్షలు విధించింది. ఇటీవల చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలోని ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని... మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో వీసాపై ఆంక్షలు విధించింది అమెరికా. ప్రతిగా చైనా ఆంక్షలు విధించడం ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.
అగ్రరాజ్యానికి చెందిన సెనేటర్ మార్కో రుబియో సహా నలుగురు ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది చైనా. దీంతో చైనా తీసుకున్న నిర్ణయాన్ని రుబియో విమర్శించారు. అయితే ఇది పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని... అమెరికా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి హక్కులు లేవని పునరుద్ఘాటించారు హువా. భవిష్యత్లో తీసుకోబోయే నిర్ణయాలు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.
ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. అత్యంత పొడవైన తోకచుక్క