ETV Bharat / international

china new policy2021:కొత్త చట్టంపై ఊహాగానాలు తగవు - చైనా కొత్త చట్టం 2021

తాము తీసుకువచ్చిన కొత్త చట్టం (china new policy2021) పొరుగు దేశాలపై ఎలాంటి ప్రభావం చూపదని చైనా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సహాయం, సరిహద్దులపై వైఖరి మారదని పేర్కొంది. సరిహద్దులను పరిరక్షించడానికే కొత్త చట్టం తెచ్చామని డ్రాగన్‌ తెలిపింది.

china new policy2021
చైనా కొత్త చట్టం 2021
author img

By

Published : Oct 29, 2021, 4:49 AM IST

తమ కొత్త సరిహద్దు చట్టం (china new policy2021) ప్రస్తుతమున్న ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపదని చైనా స్పష్టం చేసింది. కొత్త చట్టం, సరిహద్దుల విషయంలో తమ వైఖరి మారబోదని వెల్లడించింది. తాము తెచ్చిన సాధారణ చట్టంపై ఊహాగానాలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు.

భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభన కొనసాగుతున్న క్రమంలో చైనా ఓ కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీంతో చైనా ఏకపక్షంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని భారత్ ఆరోపించింది. సరిహద్దును మార్చే చర్యలను మానుకోవాలని తెలిపింది. భారత్​ ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది.

14దేశాలతో 22వేల కిలోమీటర్ల సరిహద్దును కలిగిన చైనా.. ఆయా ప్రాంతాలను సైన్యం ఏ విధంగా పరిరక్షించాలో పేర్కొంటూ తెచ్చిన కొత్త చట్టాన్ని అక్కడి పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సరిహద్దు చట్టం అమల్లోకి వస్తుంది.

ఇదీ చదవండి:సైనిక పాలనలో అరాచకం- చర్మం ఒలిచి చిత్రహింసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.