ETV Bharat / international

అనుమతి లేకుండానే మనుషులకు వ్యాక్సిన్!​ - corona vaccine developed by china

కరోనా మహమ్మారిని అంతం చేసే ఆయుధాన్ని.. ప్రపంచ దేశాల కంటే తానే ముందుగా కనిపెట్టాలని తహతహలాడుతోంది చైనాలోని ఓ ఫార్మా సంస్థ. అందుకే, ప్రభుత్వం అనుమతివ్వకముందే... వ్యాక్సిన్ కేండిడేట్​ను తమ సంస్థలోని ఉద్యోగులపై ప్రయోగించింది.

China firm uses workers to 'pre-test' vaccine in global race
అనుమతి లేకుండానే.. మానవులపై వ్యాక్సిన్ ప్రయోగం!​
author img

By

Published : Jul 16, 2020, 3:47 PM IST

కరోనాను అంతం చేసే వ్యాక్సిన్​ను ఏ దేశం ముందుగా కనిపెడితే ఆ దేశం చరిత్ర సృష్టించినట్లే. అందుకే, చాలా దేశాలు వ్యాక్సిన్​ తయారీలో పోటీ పడుతున్నాయి. ఇక, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ తానే ముందుండాలని తాపత్రయపడే చైనాలో.. ఓ ఫార్మా సంస్థ అత్యాశకు పరాకాష్టగా నిలిచింది. వ్యాక్సిన్​ను వేగంగా కనిపెట్టాలనే ఆత్రుతతో అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మానవులపై పరీక్షలకు ప్రభుత్వం ఆమోదించకముందే ఆ సంస్థలోని ఉద్యోగులపై ప్రయోగాలు చేసింది.

నేరు​గా మానవులపైనే..

బీజింగ్​లోని సినోఫార్మ్​ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ పరిశోధనకు చైనా ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అయితే, సాధారణంగా జంతువులపై చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయా లేదా అని క్షుణ్నంగా పరిశీలించాకే మానవులపై వ్యాక్సిన్​ను ప్రయోగించేందుకు ప్రభుత్వం అనుమతించాలి. కానీ, ఎలాంటి అనుమతి లేకుండానే, సినోఫార్మ్​ సంస్థ కనిపెట్టిన వ్యాక్సిన్​ను ఉద్యోగుల శరీరంలోకి పంపించింది.

పైగా.. ప్రభుత్వం అనుమతివ్వకముందే.. 30 మంది ఉద్యోగులు తమపై వ్యాక్సిన్​ ప్రయోగించమని స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రకటించింది సినోఫార్మ్​. ఉద్యోగుల వీరోచిత త్యాగాన్ని ఫొటోలు తీసి, 'కరోనాను అంతం చేసే విజయ ఖడ్గాన్ని కనిపెట్టేందుకు సాయం చేస్తున్న చేతులివి' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. అయితే, సినోఫార్మ్ సంస్థ ఇలా అనధికారంగా ఉద్యోగులపై వ్యాక్సిన్​ ప్రయోగించడం అంతర్జాతీయ నైతిక నిబంధనలు ఉల్లంఘించినట్లే అంటూ మండిపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య నిపుణలు.

ఇదివరకు, కాన్​సినో బయోలాజిక్స్​ సంస్థకు మానవులపై, సైనికాధికారులపై వ్యాక్సిన్​ ప్రయోగించడానికి అనుమతించింది చైనా ప్రభుత్వం. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకు కాన్​సినో సంస్థ.. వ్యాక్సిన్​ తయారీ గురించి మరో నాలుగు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. అంటే, అసలు వ్యాక్సిన్​ను పూర్తి స్థాయిలో కనిపెట్టకముందే.. ఆ సంస్థకు సరాసరి మానవులపై వ్యాక్సిన్​ను ప్రయోగించే అధికారం కట్టబెట్టింది చైనా ప్రభుత్వం.

తానే ముందుండాలని....

ప్రపంచంలో మానవులపై ప్రయోగం చేసే దశలో ఉన్న వ్యాక్సిన్లు కనిపెట్టిన సంస్థల్లో.. దాదాపు 12 సంస్థలు చైనాకు చెందినవే. అయితే, అమెరికా, బ్రిటన్​ దేశాల కంటే ముందే కరోనా వ్యాక్సిన్​ కనిపెట్టి.. రాజకీయంగా, శాస్త్రీయంగా ఎదగాలన్న చైనా దూకుడుతో... ప్రయోగదశలో ఉన్న వ్యాక్సిన్లకు మానవులపై ప్రయోగించేందుకు అనుమతిస్తోంది. ప్రభుత్వమిచ్చిన ఆ చొరవతో సినోఫార్మ్​ వంటి సంస్థలు ఇలా అనుమతి లేకుండానే మానవులపై ప్రయోగాలు చేస్తున్నాయి.

ఇదీ చదవండి: బలగాల ఉపసంహరణకే భారత్-చైనా కట్టుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.