ETV Bharat / international

అమెరికాకు చైనా వార్నింగ్-రెండు క్షిపణుల ప్రయోగం!

దక్షిణ చైనా సముద్రంలో రెండు క్షిపణులను ప్రయోగించింది చైనా. చైనా అధికారులపై అమెరికా విధించిన ఆంక్షలకు ఇది సమాధానంగా పేర్కొంది. చైనా గగనతలంలో యూఎస్ యుద్ధవిమానాలు విహరించకూడదంటూ హెచ్చరించింది బీజింగ్​.

china-fires-2-missiles-into-south-china-sea-to-warn-us
అమెరికాకు చైనా వార్నింగ్-రెండు క్షిపణుల ప్రయోగం!
author img

By

Published : Aug 27, 2020, 11:52 AM IST

అమెరికాను హెచ్చరించడానికి దక్షిణ చైనా సముద్రంలోకి రెండు భారీ క్షిపణులను ప్రయోగించింది చైనా. హైనాన్ ప్రావిన్స్, పారసెల్ ద్వీపాల మధ్య ఈ క్షిపణులు ప్రయోగించినట్లు స్పష్టం చేసింది. క్వింఘాయి ప్రావిన్స్ నుంచి డీఎఫ్-26బీ క్షిపణి, జేజియాంగ్ ప్రావిన్స్ నుంచి డీఎఫ్-21 డీ క్షిపణలను వదిలినట్లు తెలిపింది.

మంగళవారం అమెరికాకు చెందిన ఆర్ సీ-135ఎస్ యుద్ధ విమానం చైనా దక్షిణ సముద్రం సైనిక నియంత్రిత గగనతలంలో విహరించిందని చైనా ఆరోపించింది. అయితే, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ సైనిక స్థావర నిర్మాణానికి కారణమైన చైనా అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం తెలిపింది అమెరికా. దీంతో, చైనా అధికారులే కాక వ్యాపారులు, వారి కుటుంబ సభ్యుల రాకపోకలను అమెరికా నిలిపివేసినట్లైంది. యూఎస్ ఆంక్షలకు సమాధానంగా చైనా క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది.

"అమెరికా తెంపరితనానికి చైనా స్పందన ఇదే. అమెరికా యుద్ధ విమనాలు, సైనిక దళాలు పదేపదే చైనా గగనతంలోకి చొరబడుతున్నాయి. అందుకే ఇలా స్పందించాల్సి వచ్చింది. అయితే, బీజింగ్ లక్ష్యాన్ని పొరుగు దేశాలు అపార్థం చేసుకోవద్దు."

-చైనా అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.