చైనా జైషీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు, రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది. భయంతో ప్రజలు భవనాల్లోంచి బయటకి పరుగులు తీశారు. భూకంప లేఖినిపై 6.4 తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఎనిమిది సార్లు..
ఆదివారం రాత్రి 9:27 నిమిషాలకు తొలిసారి భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత వెనువెంటనే 8 సార్లు భూకంపం వచ్చిందని తెలిపారు. 56 కిలోమీటర్ల మేర, 16 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముగ్గురికి గాయాలు..
భూకంపం కారణంగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.. సుమారు 17 వేల మంది స్థానికులు విద్యుత్తు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొమ్మిది రైళ్ల సేవలు నిలిచిపోయాయి. అయితే, రైలు పట్టాలు ఏ మేరకు దెబ్బతిన్నాయో తెలుకునేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగింది. 112 మంది కార్మికులతో విద్యుత్తు సేవలను పునరుద్ధించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
ఇదీ చూడండి : వంతెన కూలి 9 మంది దుర్మరణం