ETV Bharat / international

లద్దాఖ్ యూటీ​ ఏర్పాటును గుర్తించం: చైనా

లద్దాఖ్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని తాము గుర్తించేది లేదని చైనా పేర్కొంది. అక్రమంగా ఈ ప్రదేశాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని చెప్పుకొచ్చింది. వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టడాన్ని తప్పుబట్టింది.

China does not recognise Union Territory of Ladakh
'లద్దాఖ్​ ఏర్పాటును చైనా గుర్తించదు'
author img

By

Published : Sep 29, 2020, 7:43 PM IST

సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో భారత్​ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించదని పేర్కొన్నారు. 'భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆమోదించేది లేదు' అని వ్యాఖ్యానించారు. సైనిక అవసరాల కోసం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ నిర్మాణాలు చేపట్టడాన్ని వ్యతిరేకించారు.

  • China does not recognize the so-called Union Territory of Ladakh illegally established by India, and opposes infrastructure construction in disputed border areas for military control purposes, FM spokesperson Wang Wenbin said in response to India building roads along the border. pic.twitter.com/z4SIRkJzAB

    — Global Times (@globaltimesnews) September 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాంగ్ వెన్​బిన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ-గ్లోబల్ టైమ్స్​ కథనం ప్రచురించింది. ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందాల ప్రకారం పరిస్థితిని తీవ్రతరం చేసే చర్యలు చేపట్టవద్దని వెన్​బిన్ పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది.

జమ్ము కశ్మీర్​ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఏకపక్షంగా చేసిన మార్పులను ఆమోదించబోమని చెప్పుకొచ్చింది.

భారత్ తీసుకున్న నిర్ణయ ప్రభావాలపై తాజాగా వెన్​బిన్​ను ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చారు. కశ్మీర్​లో పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోందని అన్నారు. కశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్​ల మధ్య దశాబ్దాలుగా నెలకొని ఉందని చెప్పారు. సంబంధిత పక్షాలన్నీ కలిసి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని హితవ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి- 300వ 'ధృవ్​'ను ఆవిష్కరించిన హెచ్ఏఎల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.