అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చూపిస్తోన్న 30 వేల ప్రపంచ పటాలను చైనా ధ్వంసం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు స్థానిక సంస్థలు ముద్రించిన ఈ ప్రపంచ పటాలను చైనా ప్రభుత్వం రద్దుచేసింది. తైవాన్ను ప్రత్యేక దేశంగా, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా ముద్రించంపై డ్రాగన్ దేశాధినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనా వాదన
భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. భారత రాజకీయ నేతలు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రతిసారీ డ్రాగన్ దేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
భారత్ వాదన
అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్గత భాగం. రాజకీయ నేతలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన విధంగానే అరుణాచల్‌ప్రదేశ్‌కు కూడా వెళ్తారనేది భారత్ వాదన.
ఇరుదేశాల మధ్య 21 సార్లు చర్చలు
భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉంది. వివాదాస్పదమైన అరుణాచల్‌ప్రదేశ్ అంశంపై ఇరుదేశాల నేతలు ఇప్పటికే 21 సార్లు చర్చించారు.