ETV Bharat / international

ఎల్​ఏసీ వెంబడి బలగాల మోహరింపుపై చైనా వింత వైఖరి! - face-off news

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అయితే..సరిహద్దులో బలగాల మోహరింపును సమర్థిచుకుంది చైనా. తమ బలగాలు సాధారణ పాట్రోలింగ్​ మాత్రమే చేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్​ తెలిపారు. తాము శాంతి, సామరస్యతను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

LAC
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల పాట్రోలింగ్​
author img

By

Published : May 13, 2020, 5:04 PM IST

ఇండో-చైనా సరిహద్దులో బలగాల మోహరింపును సమర్థించుకునే ప్రయత్నం చేసింది చైనా. వాస్తవాధీన రేఖ వెంబడి తమ బలగాలు సాధారణ గస్తీ మాత్రమే నిర్వహించాయని పేర్కొంది. తమ సైన్యం శాంతి, సామరస్యతను కోరుకుంటున్నాయని చెప్పుకొచ్చారు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాంగ్​.

లద్దాఖ్​లోని పాంగోంగ్​ త్సో సరస్సు ప్రాంతంలో.. భారత్​- చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు లిజియాంగ్​.

సరిహద్దు సమస్యపై చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యతను చైనా బలగాలు కోరుకుంటున్నాయి. చైనా వైపు వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి మా బలగాలు సాధారణ పాట్రోలింగ్​ నిర్వహించాయి. చైనాతో కలిసి పనిచేయాలని భారత్​ను కోరుతున్నాం. దౌత్య సంబంధాల బలోపేతం, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వంపై ప్రభావం పడేలా భారత్​ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. సరిహద్దు​ సమస్యపై ఇరు దేశాలు దౌత్యపరంగా చర్చించుకోవాలి.

- జావో లిజియాంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఇరు దేశాల సైనికుల మధ్య మే 5న జరిగిన ఘర్షణ తర్వాత.. లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక చాపర్లు చక్కర్లు కొడుతూ కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. సుఖోయ్​-30 యుద్ధవిమానాలను రంగంలోకి దించాయి. అయితే చైనా సైనిక హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖను మాత్రం దాటలేదని, రేఖకు దగ్గరగా చక్కర్లు కొట్టాయని ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టంచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.