ETV Bharat / international

చైనా చీప్​ ట్రిక్స్​- గ్లోబల్​ టైమ్స్​లో మరో కథనం - భారత్ చైనా సరిహద్దు ఘర్షణ

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా అసలు ఉద్దేశం ప్రపంచ దేశాలకు ముందే తెలుసు. ఈ నేపథ్యంలో నేరుగా చేసే ప్రకటనలు, బెదిరింపులు అంతర్జాతీయంగా ఎక్కడ ఇరుకున పెడతాయో అని భావించిన చైనా... తన మౌత్​పీస్​ పత్రికలను వాడుకుంటోంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని.. సత్యదూరమైన, కుట్రపూరితమైన కథనాల్ని ఈ పుంఖానుపుంఖాలుగా రాయిస్తోంది.

China-cheap-tricks-through-global-times
చైనా చీప్​ ట్రిక్స్​- గ్లోబల్​ టైమ్స్​లో మరో కథనం
author img

By

Published : Sep 18, 2020, 2:17 PM IST

నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోతున్న చైనా అనేక పాతకాలపు యుద్ధతంత్రాలకు తెరతీస్తోంది. ఓవైపు అధికార మీడియాను ఉపయోగించుకొని బెదిరింపు ప్రకటనలు చేస్తోంది. కానీ, భారత సైన్యం వాటిని కేవలం తాటాకు చప్పుళ్లుగా భావిస్తూ కదన రంగంలో తమదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది. మరోవైపు 'పాటల కచేరీ'లతో భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న చీప్‌ ట్రిక్‌ను ముందే పసిగట్టి మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది.

గ్లోబల్‌ టైమ్స్‌ చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ. చైనా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా అసలు ఉద్దేశం ప్రపంచ దేశాలకు ముందే తెలుసు. ఈ నేపథ్యంలో నేరుగా చేసే ప్రకటనలు, బెదిరింపులు అంతర్జాతీయంగా ఎక్కడ ఇరుకున పెడతాయో అని భావించిన సీసీపీ తన మౌత్‌పీస్‌ పత్రికను వాడుకొంటున్నాయి. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని.. సత్యదూరమైన, కుట్రపూరితమైన కథనాల్ని ఈ పత్రిక పుంఖానుపుంఖాలుగా రాస్తోంది. మీడియా విలువలు ఏమాత్రం లేని ఆ పత్రిక సంపాదకుడు హు షీజిన్‌ భారత్‌పై విషం చిమ్మే బాధ్యతను తన భుజాల మీదకు ఎత్తుకున్నాడు. ఈయన కేవలం పత్రికలో వ్యాసాలకే పరిమితం కాకుండా ట్విటర్‌నూ వేదికగా మార్చుకున్నారు. చైనాలో ఏమాత్రం ఉపయోగించని ఈ యాప్‌ను ఎంచుకోవడంలోనే ఆయన దురుద్దేశం అర్థంచేసుకోవచ్చు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు తప్పుడు వార్తల్ని, సమాచారాన్ని చేరవేయడమే సాధనంగా సామాజిక మాధ్యమాన్ని వాడుకుంటున్నారన్నది సుస్పష్టం. పైగా చైనాకు సంబంధించిన ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేసినా.. అక్కడి ప్రజలకు తెలిసే అవకాశమే లేదు.

హు షీజిన్‌ తప్పుడు ప్రచారాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారనడానికి ఆయన చేసిన ట్వీట్లే నిదర్శనం. జూన్‌ 15న గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు పక్షాల్లో మరణాలు సంభవించాయని ట్విటర్‌లో బహిరంగంగా అంగీకరించారు. చైనా బదులు తీర్చుకుంటుందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. అదే భారత్‌ వైపు 20 మంది చనిపోగా.. చైనా వైపు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు మరణించారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. తాజాగా రాజ్‌నాథ్‌ ప్రకటనను తప్పుడు సమాచారంగా పేర్కొంటూ షీజిన్ ఒక ట్వీట్‌ చేశారు. చాలా చాలా తక్కువ మంది చైనా సైనికులు మరణించారంటూ విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌ దళాలే దాదాపు 16మంది చైనా సైనికుల మృతదేహాలను వారికి అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఘటన అనంతరం చైనా స్థావరాల్లో వచ్చిన ఎయిర్‌ అంబులెన్స్‌లు, వినియోగించిన వాహనాలను లెక్కగట్టే మృతులు, గాయపడిన వారి సంఖ్య భారీగానే ఉందని సైన్యం నిర్ధారణకు వచ్చింది. ఇక ఇటీవల చైనా సైనికుల సమాధుల ఫొటోలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి.

అలాగే.. సరిహద్దుల్లో పంజాబీ పాటలు వినిపిస్తూ మన సైనికుల్ని ఏమార్చాలన్న చీప్‌ ట్రిక్‌ని సైతం హు షీజిన్‌ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. భారత్‌కు మరో మార్గం లేదని.. అన్ని దారులు మూసుకుపోయాయన్న సందేశం ఇవ్వడానికే పంజాబీ పాటలు వినిపిస్తున్నారని వివరణ ఇచ్చుకొన్నారు. అలాగే చైనా ఒంటరిగా ప్రదర్శిస్తున్న కొన్ని సైనిక విన్యాసాలు, ట్యాంకర్ల మోతకు సంబంధించి వండివార్చిన వీడియోలను తరచూ పోస్ట్‌ చేస్తూ 'దేనికైనా సిద్ధం' అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇలా గ్లోబల్‌ టైమ్స్‌ కథనాలు, హు షీజిన్‌ ట్వీట్లు తరచూ భారత్‌ చుట్టూ తిరుగుతుంటాయి.

ఇటీవల చైనా అతిక్రమణల వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఎండగడుతూ అమెరికా కాంగ్రెస్‌కు ఓ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రత్యర్థుల్ని బలహీనపర్చేందుకు చైనా అనుసరించే పరోక్ష వ్యూహాలను(నాన్‌ వార్‌ మిలిటరీ ట్యాక్టిక్స్‌) అందులో వివరించింది. శత్రువులతో యుద్ధం తలెత్తే స్థాయిలో కాకుండా చైనా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దానిలో పేర్కొంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో అనిశ్చితి, అస్థిరత నెలకొనేలా చేస్తుందని తెలిపింది. ఇందుకోసం అనేక సంస్థల్ని, వ్యవస్థల్ని పావులుగా వాడుకుంటుందని స్పష్టం చేసింది. తాజాగా భారత్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నది కూడా ఇదే. ఆ మైండ్‌గేమ్‌లో గ్లోబల్‌ టైమ్స్‌ దాని సంపాదకులు పాత్రధారులుగా మారారు.

ఇదీ చూడండి: రష్యా​ టీకా తీసుకున్న వారిలో సైడ్​ ఎఫెక్ట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.