చైనా-పాక్ మధ్య అన్ని పౌర విమాన సేవలను చైనా రద్దు చేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
పాక్ గగనతలం మూసివేత..
దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడం వల్ల పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దీని వల్ల ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల మధ్య విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చైనా మార్గం
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (సీఏఏసీ) అభ్యర్థన మేరకు ఈ ఇబ్బందులు తొలగించడానికి చైనా ముందుకు వచ్చింది. తన గగనతలాన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి అనుమతించింది.
పశ్చిమాసియా దేశాల విమానాలు సాధారణంగా పాక్, ఇండో-పాక్ సరిహద్దు మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం వీటిని భారత్, మయన్మార్ నుంచి లేదా మధ్య ఆసియా మీదుగా చైనాకు మళ్లిస్తున్నారు.
అనిశ్చితి తొలిగేనా...
బుధ, గురువారాల్లో పాక్ చైనా విమాన సర్వీసులతో పాటు మిగతా ఆంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా రద్దు చేసింది. ఈ రోజైనా ఈ అంతర్జాతీయ సర్వీసులను పునరుద్దరిస్తారో, లేదో తెలియదు.
సాధారణంగా పాక్ నుంచి ప్రతివారం 22 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తాయి. వాటిలో 2 చైనాకు, మిగతా 20 విమాన సర్వీసులు ఇతర దేశాలకు ఉంటాయి.