ETV Bharat / international

భారత సరిహద్దులో చైనా శాశ్వత శిబిరాలు

author img

By

Published : Jul 15, 2021, 4:52 PM IST

Updated : Jul 15, 2021, 10:30 PM IST

భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో శాశ్వత శిబిరాలను నిర్మిస్తోంది చైనా. ఫార్వర్డ్​ ప్రాంతాల్లో దీర్ఘకాలంపాటు సైనికుల మోహరింపు.. సరిహద్దులకు వేగంగా బలగాలు తరలించేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

China building concrete camps
చైనా శాశ్వత నిర్మాణాలు

ఓవైపు భారత్​తో శాంతి మంత్రం పఠిస్తూనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది చైనా. లద్దాఖ్​లో సైనిక ప్రతిష్టంభన(Ladakh Standoff) కొనసాగుతున్నప్పటికీ.. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ)కి సమీపంలో శాశ్వత శిబిరాలను నిర్మిస్తోంది డ్రాగన్​ సైన్యం(China Army). ఈ నిర్మాణాల ద్వారా వివాదాస్పద ప్రాంతాలను ఆ దేశ సైన్యం అత్యంత తక్కువ సమయంలోనే చేరుకునే వీలు కలగనుంది.

సిక్కింలోని నకులా ప్రాంతానికి సమీపంలో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా భూభాగంలో అలాంటి ఓ క్యాంప్​ నిర్మించినట్లు ప్రభుత్వ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగిన ప్రాంతానికి కొన్ని క్షణాల్లో చేరుకునేంత దూరంలోనే ఈ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు.

"సరిహద్దు ప్రాంతాలకు వేగంగా సైనికులను తరలించేందుకు వీలుగా చైనా శాశ్వత కాంక్రీట్​ శిబిరాలను నిర్మిస్తోంది. రోడ్డు సౌకర్యాలు సైతం మెరుగ్గా ఉన్నాయి. దాంతో గతంలో కంటే వేగంగా బలగాలను చేరవేసేందుకు వీలు కలుగుతుంది. "

- సీనియర్​ అధికారి

తూర్పు లద్దాఖ్​లోనూ..

కాంక్రీట్​ నిర్మాణాలు తూర్పు లద్దాఖ్​ సహా అరుణాచల్​ ప్రదేశ్​ సెక్టార్​కు సమీపంలోనూ కనిపించినట్లు చెప్పారు అధికారి. శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా ఈ భవనాలు ఉన్నట్లు తెలిపారు. దీర్ఘకాలం పాటు పార్వర్డ్​ ప్రాంతాల్లో బలగాలను మోహరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ అనంతరం.. పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే భారత్​తో జరిగిన ఒప్పందం ప్రకారం పాంగాంగ్​ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించి టిబెట్​లోని రుటోగ్​ టౌన్​లోని తమ భూభాగంలోకి తరలించింది చైనా. అక్కడ సైన్యానికి అవసరమైన స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:భారత్​ హెచ్చరికతో చర్చలకు సిద్ధమైన చైనా!

Last Updated : Jul 15, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.