ETV Bharat / international

వరద నీటి విడుదల కోసం డ్యామ్ బ్లాస్ట్

author img

By

Published : Jul 20, 2020, 4:34 PM IST

చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టలు వరద నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్​ చైనాలోని ఓ ఆనకట్టను పేల్చివేసి... వరద నీటిని విడుదల చేశారు అధికారులు.

China blasts dam to release floodwaters as death toll rises
ఆనకట్టను పేల్చివేసి.. వరద నీరు విడుదల

చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సెంట్రల్​ చైనాలోని అన్​హుయి రాష్ట్రంలో చూహే నదిపై ఆనకట్టను పేల్చివేసి... వరద నీటిని విడుదల చేశారు అధికారులు. ఇలా చేయకపోతే ఆనకట్ట వెనుక భాగంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు.

సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తోన్న నది

మిగిలిన చోట్ల... సైనికులు, సహాయక సిబ్బంది కలిసి కట్టల బలాలను పరీక్షిస్తున్నారు. బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇసుక సంచులు, రాళ్లు వేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జియాంషీ రాష్ట్రంలో 15 గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు జలమయం అయ్యాయి. 14 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరద ముప్పు ఎదుర్కొనేందుకు చర్యలు

ఇసుక సంచులు సిద్ధం చేస్తున్న సైనికులు

వరదల వల్ల ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. పలువురు గల్లంతయ్యారు. సుమారు 18లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 7 బిలియన్లు డాలర్లు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇంటిని ఖాళీ చేస్తున్న ఓ కుటుంబం

ఇదీ చూడండి: నేపాల్​ ప్రధానికి ఊరట- వెనక్కి తగ్గిన ప్రచండ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.