భూ కక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో(china astronauts space station) 90 రోజులు గడిపిన ముగ్గురు చైనా వ్యోమగాములు (China astronaut) తిరిగి భూమిమీదకు చేరుకున్నారు. నీ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హాంగ్బో ప్రయాణించిన షెంజౌ-12.. గోబీ ఎడారిలో ల్యాండ్ అయింది. ఈ దృశ్యాలను ఆ దేశ అధికార ప్రసార సంస్థ- సీసీటీవీ చూపించింది.
ఈ వ్యోమగాములు ఇప్పటికే అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన చైనీయులుగా (China astronaut) రికార్డు స్థాపించారు. రెండుసార్లు స్పేస్‌వాక్ (china astronauts space walk) నిర్వహించారు. అంతరిక్ష కేంద్రానికి 10 మీటర్లు పొడవైన యాంత్రిక హస్తాన్ని అమర్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. తన రోదసి కేంద్రానికి మరో రెండు మాడ్యూళ్లను జోడించాలని డ్రాగన్ భావిస్తోంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక దీని బరువు 66 టన్నులు ఉంటుంది.
ఇదీ చూడండి: భారత్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం.. చైనా వెన్నులో వణుకు!