భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో(India China Border) తమ బలగాలకు కొత్త సారథిగా జనరల్ వాంగ్ హైజియాంగ్ను నియమించింది చైనా. పీఎల్ఏ(People's Liberation Army) వెస్టర్న్ థియేటర్ కమాండ్ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. మరో నలుగురు సీనియర్ మిలిటరీ అధికారులకు కూడా సైన్యం అత్తున్నత హోదా జనరల్‌గా పదోన్నతి కల్పించింది. బిజింగ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(xi jinping) వీరికి నియామక పత్రాలు అందజేశారు. చైనా మిలిటరీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
![China appoints new army commander to head troops along Indian border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12992960_i.jpg)
షిన్జియాంగ్ ప్రాంతంతో పాటు టిబెట్ స్వయంపాలిత ప్రాంతాలు, భారత్‌తో సరిహద్దు ప్రాంతాల భద్రతను చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తుంది. చైనా ఆర్మీ పర్యవేక్షించే అతిపెద్ద భౌగోళిక ప్రాంతం కూడా ఇదే.
గతేడాది మే నెలలో భారత్-చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలు(India China Border Dispute) తలెత్తాయి. అప్పటి నుంచి వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు సారథులను మార్చడం ఇది నాలుగోసారి.
సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు పరస్పర అంగీకారంలో భాగంగా గల్వాన్ లోయ, పాంగాంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్, చైనా. అయితే తూర్పు లద్దాఖ్‌లో ఫ్రిక్షన్ పాయింట్లయిన హాట్ స్ప్రింగ్స్, దేప్సాంగ్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
ఇదీ చదవండి: Afghan Crisis: మీడియాకు తాలిబన్ల వార్నింగ్- 'మసూద్' వార్తలపై నిషేధం!