ETV Bharat / international

'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు

author img

By

Published : Jan 30, 2020, 6:15 PM IST

Updated : Feb 28, 2020, 1:35 PM IST

కరోనా వైరస్​ను ఎదుర్కోవడానికి చైనా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వైరస్​ నిరోధించడానికి 4 బిలియన్​ డాలర్లను కేటాయించింది. మరోవైపు ఒక్కో దేశం చైనాతో సంబంధాలను తెంచుకుంటోంది. తూర్పు సరిహద్దును మూసివేస్తున్నట్టు  రష్యా పేర్కొంది.

China allocates USD four billion to combat coronavirus
'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు
'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు

ప్రాణాంతక కరోనా వైరస్​పై యుద్ధానికి ముమ్మర చర్యలు చేపట్టింది చైనా. శరవేగంగా ఆసుపత్రులను నిర్మిస్తున్న డ్రాగన్​ దేశం... తాజాగా వైరస్​ను నిరోధించేందుకు దాదాపు 4 మిలియన్​ డాలర్ల నిధులను కేటాయించింది. పనులకు ఆటంకం కలగకుండా.. ఈ నిధులను సక్రమంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

వుహాన్​ కేంద్రబిందువుగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 170మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు సంబంధించి 7వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

విరాళాలతో ముందుకు..

గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చైనాకు దిగ్గజ వ్యాపారవేత్తలు అండగా నిలుస్తున్నారు. డ్రాగన్​ దేశంలోనే రెండో అత్యంత ధనికుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​ మా.. ప్రభుత్వానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 14మిలియన్​ డాలర్ల విరాళాలు అందించనున్నట్టు తెలిపారు. టీకాను అభివృద్ధి చేసేందుకు తన సంస్థలు కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రాణాంతక వైరస్​తో పోరులో భాగంగా 10 మిలియన్​ డాలర్లను చైనా, ఆఫ్రికా దేశాలకు అందించనున్నట్టు గేట్స్​ ఫౌండేషన్​ ప్రకటించింది.

సంబంధాలు కట్​...

మరోవైపు వైరస్​ భయం వల్ల డ్రాగన్​ దేశం నుంచి ఒక్కో దేశం దూరం జరుగుతోంది. ఇప్పటికే అనేక దేశాలు తమ విమాన సేవలను రద్దు చేసుకున్నాయి. తాజాగా తూర్పు సరిహద్దును మూసివేయనున్నట్టు రష్యా ప్రకటించింది. తమ పౌరుల భద్రతే ముఖ్యమని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనా పౌరులకు ఎలక్ట్రానిక్​ వీసాలను నిలిపివేస్తున్నట్టు రష్యా విదేశాంగశాఖ తెలిపింది.

బాక్సాఫీస్​ విలవిల...

ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం చైనాలో సినీ పరిశ్రమకు విపరీతమైన ఆదరణ ఉంది. అనేక భాషల్లోని చిత్రాలు డ్రాగన్​ దేశంలో ప్రదర్శితమవుతాయి. కానీ కరోనా ధాటికి చైనాలోని దాదాపు 70వేల థియేటర్లు మూతపడ్డాయి. దీనితో అంతర్జాతీయ బాక్సాఫీస్​ ఇప్పటికే 2 బిలియన్​ డాలర్లు నష్టపోయింది. ముందు ముందు పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:- కరోనా ఎఫెక్ట్​: టోకెన్​ ఉన్నవారికే మాస్క్​ల విక్రయం!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL67
DL-POLLS-PM-RALLIES
Delhi polls: PM Modi to hold public meetings on Feb 3, 4
         New Delhi, Jan 30(PTI) Prime Minister Narendra Modi will hold two public meetings in the national capital on February 3 and 4 ahead of the Delhi Assembly polls, Union Minister Harsh Vardhan said on Thursday.
          The first public meeting will be held at CBD Ground in Karkardooma around 2.30 pm on February 3. Modi's next public meeting will be held at Ramleela Ground in Dwarka on February 4, Vardhan said.
          Campaigning for the polls will conclude at 5 pm on February 6 and voting for the 70-member assembly will take place on February 8. PTI VIT
SNE
SNE
SNE
01301652
NNNN
Last Updated : Feb 28, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.