దేశ నూతన ఏడాది సెలవులు సమీపిస్తున్న తరుణంలో.. పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు చైనా తీవ్రస్థాయిలో కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 2.27కోట్ల మందికి కరోనా టీకాను అందించింది. అదే సమయంలో పరీక్షల సంఖ్యను కూడా విపరీతంగా పెంచింది. ప్రస్తుతం చైనా.. 1.5కోట్లకుపైగా రోజువారీ పరీక్షలు నిర్వహిస్తోంది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల మీద ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు పేర్కొంది.
చైనాలో మంగళవారం 75 కొత్త కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. వారిలో 55 మంది అక్కడి వారే కాగా.. మరో 20 మంది విదేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. చైనా అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం వరకు 89,272 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 4,636 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: మా యాప్లు ఎలా నిషేధిస్తారు: చైనా