ETV Bharat / international

ఒక్క డాలర్​కే ఆ మీడియా సంస్థ విక్రయం! - Australia’s Nine Entertainment

ఆ మీడియా సంస్థ న్యూజిలాండ్​లో చాలా దినపత్రికలను ముద్రిస్తుంది. అదే పేరుతో ప్రముఖ న్యూస్​ వెబ్​సైట్​ను నడుపుతోంది. ఆ సంస్థలో 900 మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా విజృంభణతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ సంస్థను కేవలం ఒకే ఒక డాలరుకు సంస్థ సీఈఓకు విక్రయించింది యాజమాన్యం. అదే స్టఫ్​ మీడియా సంస్థ.

CEO buying struggling New Zealand media company for USD 1
ఒక్క డాలర్​కే ఆ మీడియా సంస్థ అమ్మకం!
author img

By

Published : May 26, 2020, 5:59 AM IST

Updated : May 26, 2020, 7:13 AM IST

న్యూజిలాండ్​లోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన 'స్టఫ్​' కేవలం ఒకే ఒక్క డాలర్​కు ఆ సంస్థ కార్యనిర్వహణ అధికారిణికి అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. స్టఫ్ మీడియా సంస్థ ప్రతిరోజు​ చాలా దినపత్రికలను ముద్రిస్తుంది. అదే పేరుతో ప్రముఖ న్యూస్​ వెబ్​సైట్​ను నడుపుతోంది. ఆ సంస్థలో 400మంది పాత్రికేయులతో కలిపి మొత్తం 900 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన 9 ఎంటర్​టైన్​మెంట్​ అధీనంలోని స్టఫ్​.. కరోనా మహమ్మారి చుట్టుముట్టక ముందు నుంచే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వల్ల ప్రకటనల ఆదాయం కూడా తగ్గిపోయింది.

ఆస్ట్రేలియా స్టాక్​ మార్కెట్​కు ఇచ్చిన ఓ ప్రకటనలో 9 ఎంటర్​టైన్​మెంట్​ ఈ మేరకు స్టఫ్​ అమ్మకంపై వివరాలు వెల్లడించింది.

"స్టఫ్​ మీడియాను.. సంస్థ సీఈఓ సినాడ్​ బౌచర్​కు యాజమాన్య కొనుగోలు ఒప్పందంలో భాగంగా విక్రయిస్తున్నాం. ఒప్పందం ఈ నెల చివరివరకు పూర్తవుతుంది. స్థానిక యాజమాన్యం ఉండటం స్టఫ్​కు ముఖ్యమని మేము ఎప్పుడూ నమ్ముతాం. ఇది పోటీలో ఉండేందుకు, వినియోగదారులకు చేరువయ్యేందుకు ఉత్తమమైన నిర్ణయం అనుకుంటున్నాం."

– హగ్​ మార్క్స్​, సీఈఓ, 9 ఎంటర్​టైన్​మెంట్.​

ఈ అంశంలో స్టఫ్​ సీఈఓ సినాడ్​ బౌచర్​ సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్య మార్పిడిపై కీలక విషయాలు వెల్లడించారు.

"ప్రస్తుతం ఉద్యోగులను తొలగించటం, వార్తాపత్రికను మూసివేయటం వంటి ప్రణాళికలు ఏమీ లేవు. యాజమాన్యం మారినంత మాత్రానా స్టఫ్​ కానీ, ఇతర మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ తొలిగిపోవు. ఆన్​లైన్​ పాఠకుల నుంచి ఆదాయం పెంచాలనుకుంటున్నాం. స్టఫ్​ గత నెల పాఠకులు విరాళం ఇచ్చేందుకు ఓ ఎంపికను ఏర్పాటు చేసింది. లిమిటెడ్​ లయబిలిటి కంపెనీ ద్వారా స్టఫ్​ను కొనుగోలు చేస్తున్నాం. ఇందులో ఉద్యోగులకే ప్రత్యక్ష వాటాను ఇవ్వటం ద్వారా యాజమాన్య మార్పిడి ప్రణాళికపై పని చేస్తున్నాం. ఈ ఒప్పందం ప్రత్యర్థి మీడియా ఎన్​జడ్​ఎంఈ.. స్టఫ్​ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలకు ముగింపు పలుకుతుంది."

- సినాడ్​ బౌచర్​, స్టఫ్​ సీఈఓ

న్యూజిలాండ్​లోని చాలా మీడియా సంస్థలు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎన్​జడ్​ఎంఈ 200 ఉద్యోగాలు తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో స్టఫ్​ వేతనాల్లో కోత విధించింది. గత నెల జర్మనీ సంస్థ బాయర్​ మీడియా న్యూజిలాండ్​​లోని తన సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది. మ్యాగజైన్ల ప్రచురణలు ఆపేసింది.

Last Updated : May 26, 2020, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.