ETV Bharat / international

పండుగ వేళ జపాన్​లో కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తంగా 5 కోట్ల 84 లక్షలకు పైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 13లక్షల 86 వేల మందికి పైగా మృతిచెందారు. జపాన్​లో పండుగ సెలవుల నేపథ్యంలో గడిచిన నాలుగు రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు బయటపడతున్నాయి.

Cases in Japan hit record amid holiday travel
జపాన్​లో గరిష్ఠానికి కొవిడ్​ కేసులు
author img

By

Published : Nov 22, 2020, 12:23 PM IST

జపాన్​లో మూడు రోజుల థ్యాంక్స్​ గివింగ్​ సెలవలతో కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లకు పోటెత్తడం వల్ల ఒక్కరోజులోనే గరిష్ఠ స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 2,508 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 1,963 మంది మరణించారు.

ఇతర దేశాల్లో...

  • ఆస్ట్రేలియాలో వేసవి కావడం కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశంలో పలు చోట్ల ఆంక్షలను తొలగించారు. కానీ మాస్క్​ లేకుండా బయట తిరగడం నిషేధించారు.
  • వైరస్​ వ్యాప్తి అదుపులోకి వస్తున్నందున బ్రిటన్​లో విధించిన లాక్​డౌన్​ను సడలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రధాని బోరిస్​ జాన్సన్​ డిసెంబర్​ 2 నుంచి లాక్​డౌన్​ ఎత్తివేసేందుకు అనుమతినిచ్చారు. ఆర్​టీపీసీఆర్​ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.
  • మెక్సికోలో తాజాగా 550 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,01,373 కు చేరింది.
  • పాకిస్థాన్​లో మరో 2,665 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 59 మంది మరణించారు. మొత్తం మూడు లక్షల 29 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • దక్షిణ కొరియాలో మరో 330 మంది వైరస్​ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 30,733 చేరింది. 505 మంది మరణించారు.

వివిధ దేశాల్లో కొవిడ్​ కేసులు ఇలా:

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 13 లక్షల 86 వేల మందికిపైగా వైరస్​కు బలవ్వగా... కోటి 84 లక్షలకు పైగా యాక్టివ్​ కేసులున్నాయి.

దేశంకేసులుమరణాలు
అమెరికా12,450,666261,790
బ్రెజిల్6,052,786169,016
ఫ్రాన్స్2,127,05148,518
రష్యా2,064,74835,778
స్పెయిన్1,589,21942,619
బ్రిటన్1,493,38354,626
ఇటలీ1,380,53149,261
అర్జెంటినా1,366,18236,902
కొలంబియా1,240,49335,104
మెక్సికో1,032,688101,373

ఇదీ చూడండి: దేశంలో మరో 45,209 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.