అఫ్గానిస్థాన్‌లోని ఘోర్ రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 16 మంది మరణించారు. ఈ ఘటనలో వందమందికిపైగా గాయాలయ్యాయి.
గాయాలపాలైన డజన్ల కొద్ది మందికి ఘోర్‌లోని ఓ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ప్రాతీయ పోలీసు చీఫ్ కార్యాలయం, ప్రభుత్వ భవన సముదాయాల సమీపంలో ఈ బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు.
ఆయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ఇంత వరకు ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం ప్రకారం దాడులు నిలిపివేస్తామని అమెరికా ప్రకటించిన తర్వాత ఈ దాడి జరగటం గమనార్హం. ఇటీవలే వేలాది మందిని తరలించిన తర్వాత.. దక్షిణ అఫ్గానిస్థాన్‌లో దాడులను ఆపేసేందుకు తాలిబన్లు శుక్రవారం ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి:హైతీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు