ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు... అత్యవసర పరిస్థితి విధింపు - ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. న్యూసౌత్​ వేల్స్​లో ఏడు రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధించారు అధికారులు. 2 వేల అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7.4 మైళ్ల ప్రాంతం ఆహుతయింది. ఆరుగురు మృతి చెందారు. 800 ఇళ్లు దగ్ధమయ్యాయి.

Bushfire state of emergency declared in Australia
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం
author img

By

Published : Dec 19, 2019, 1:30 PM IST

Updated : Dec 19, 2019, 2:32 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు

ఆస్ట్రేలియాలో నాలుగు నెలల క్రితం చెలరేగిన కార్చిచ్చు నానాటికీ ఉగ్రరూపం దాల్చుతోంది. వేడి గాలుల కారణంగా దావానలం వేగంగా వ్యాపిస్తోంది. న్యూసౌత్​ వేల్స్​లో 100కు పైగా వేర్వేరు చోట్ల ఎగిసిపడుతున్న మంటలతో వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు అత్యవసర పరిస్థితి విధించింది ప్రభుత్వం. దేశ రాజధాని సిడ్నీని దట్టమైన పొగ కమ్మేసింది.

విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు న్యూసౌత్​ వేల్స్​లో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించారు.

7.4 మైళ్ల ప్రాంతం ఆహుతి..

ఆస్ట్రేలియా కార్చిచ్చులో దేశవ్యాప్తంగా సుమారు 7.4 మైళ్ల మేర ప్రాంతం అగ్నికి ఆహుతయింది. ఆరుగురు మరణించారు. 800 ఇళ్లు దగ్ధమయ్యాయి. క్వీన్​లాండ్​ రాష్ట్రంలో 70 కార్చిచ్చు ప్రాంతాలను గుర్తించారు.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..

అగ్ని ప్రమాదాలు, వేడి గాలుల కారణంగా దేశవ్యాప్తంగా గురువారం అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 41.9 డిగ్రీల సెల్సియస్​ (107.4ఎఫ్​) నమోదైంది. కార్చిచ్చు కారణంగా సుమారు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. 2013లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40.3 డిగ్రీలుగా ఉంది.

2వేల అగ్నిమాపక యంత్రాలు..

దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న దావానలాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహా అమెరికా, కెనడా దేశాల సహాయంతో సుమారు 2 వేల అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో 100 మందితో కూడిన 5 బృందాలను మోహరించారు అధికారులు.

ఇదీ చూడండి: స్పెయిన్​: మ్యాచ్​ అనంతరం ఘర్షణ.. 46 మందికి గాయాలు

Delhi, Dec 19 (ANI): Section 144 has been imposed near Red Fort in old Delhi amid the nation-wide protests against new Citizenship law. The Delhi Police barricaded roads and imposed traffic restrictions to clamp down on planned protests against the Citizenship Amendment Act (CAA). As per Section 144 of the Code of Criminal Procedure, more than four people can't assemble in the said area.
Last Updated : Dec 19, 2019, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.