ETV Bharat / international

కార్చిచ్చు ఘోరం: అంతరించిపోయే జాబితాలో కోలాలు!

author img

By

Published : Jan 14, 2020, 9:33 AM IST

ఆస్ట్రేలియాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోలా బేర్​లు అంతరించిపోయే జాతి జాబితాలో చేరే ప్రమాదం ఏర్పడింది. కార్చిచ్చు ధాటికి ఇప్పటికే 30 శాతం కోలాల నివాసాలు బూడిదయ్యాయి. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర మానసిక ఆరోగ్య సేవలకై 76 మిలియన్ల​ ఆస్ట్రేలియన్ డాలర్లను ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.

koala
కార్చిచ్చు ఘోరం: అంతరించిపోయే జాబితాలో కోలాలు!

ఆస్ట్రేలియా అనగానే మనకు గుర్తొచ్చేది కోలాబేర్​. అమయాకమైన చూపులతో ఈ కోలాలు ఆస్ట్రేలియాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ప్రస్తుతం విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల అక్కడ జీవించే కోలాల​ జాతికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 30శాతం కోలాల నివాసాలు మంటల్లో బూడిదయ్యాయి.

కోలాలను అంతరించిపోయే జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర మానసిక ఆరోగ్య సేవలకు 76 మిలియన్ల​ ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.537కోట్లు) ప్రకటించింది.

ఇటీవల కంగారూ ద్వీపం​లో చెలరేగిన కార్చిచ్చు... వేలాది వన్యప్రాణులను బలి తీసుకుంది. మరీ ముఖ్యంగా ఆ దేశంలో ఎక్కువుగా కనపడే కంగారు, కోలాలు​ అధిక సంఖ్యలో మరణించాయి.

ఇప్పటివరకు దాదాపు 1.25బిలియన్ల జంతువులు కార్చిచ్చు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల హెక్టార్ల భూమి బూడిదయ్యింది.

ఇదీ చూడండి : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. కోలా బేర్​ మనుగడకు ముప్పు?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.