రష్యాలో ఘోరప్రమాదం జరిగింది. మాస్కో నుంచి వోల్గోగార్డ్ వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్ తో సహా బస్సులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు . మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో చిన్నారులు ఉన్నారు.
చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సముద్రంలో పడవ మునిగి 20మంది మృతి