అఫ్గానిస్థాన్‌లో సుమారు 6000 - 6500 మంది పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లు ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. అందులో తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ తీవ్రవాదులు అధికంగా ఉన్నారని పేర్కొంది. ఐఎస్ఐఎస్, అల్-ఖైదాకు చెందిన ఉగ్రమూకలు అఫ్గాన్‌లోని ఆయా రాష్ట్రాల్లో అధికంగా సంచరిస్తున్నట్లు యూఎన్ఓ తెలిపింది.
ప్రతీకారం కోసమే..
అల్-ఖైదా ఉగ్రవాదులు తమ నాయకుడు అసిమ్ ఉమర్ మరణంపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపింది యూఎన్. అఫ్గాన్‌లో అతి పెద్ద ఉగ్రవాద సంస్థ అయిన.. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ), పాక్‌లో పలు దాడులకు బాధ్యత వహించిన ఇతర తీవ్రవాద మూకలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించింది.
అఫ్గాన్‌లో పరిస్థితుల్ని పర్యవేక్షించడం కోసం సుమారు 400- 600 మంది అల్-ఖైదా తీవ్రవాదులు చురుగ్గా పనిచేస్తున్నట్లు అంచనా వేసింది యూఎన్ఓ.
ఇదీ చదవండి: 4 దశాబ్దాల తర్వాత ఆ చైనా కాన్సులేట్ మూసివేత