ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్‌వేల్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దశాబ్దంలో ఎన్నడూ చూడని రీతిలో వరదలు ప్రభావం చూపించాయి. సిడ్నీకి పశ్చిమాన ఉన్న వర్రగంబ డ్యాం పొంగిపొర్లుతోంది. నగరంలోని పలు దుకాణాలు, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరిన్ని శిబిరాలను సిద్ధం చేస్తున్నారు. మరో మూడు-నాలుగు రోజులు వాతావరణం ఇలాగే ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వందేళ్ల విపత్తు
వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడినట్లు రాష్ట్ర ప్రధాని గ్లాడీస్ బెరెజిక్లియాన్ తెలిపారు. రాష్ట్ర అత్యవసర సేవల బృందాలు 640 ఫోన్‌కాల్స్‌ను స్వీకరించాయని, వరదల్లో చిక్కుకున్నవారి నుంచి 66 కాల్స్ వచ్చాయని చెప్పారు. ఉత్తర తీరం సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత కేంద్రాలకు పంపిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనను వందేళ్లకు ఓసారి సంభవించే విపత్తుగా అభివర్ణించారు. అయితే, పరిస్థితులు ప్రమాదకరంగా లేవని చెప్పారు.
వరద ప్రభావ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించారు గ్లాడీస్. పశ్చిమ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. గత రికార్డులను ఇవి తుడిచేశాయని తెలిపారు.