చతుర్భుజ కూటమి(క్వాడ్) త్వరలో సమావేశమవుతుందని సంకేతాలు ఇచ్చారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. దీని గురించి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో చర్చించినట్లు తెలిపారు.
"క్వాడ్ దేశాల సమావేశం ఎప్పుడు జరపాలన్న విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కొన్ని వారాల క్రితమే మాట్లాడాను. గత వారమే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తోను చర్చించాను. ద్వైపాక్షిక సమావేశమప్పుడు ప్రధాని మోదీతో , జపాన్ ప్రధానితో మాట్లాడాను. క్వాడ్ దేశాల సమావేశం ఇండో- ఫసిపిక్ ప్రాంతంలో శాంతి, సుస్థితరను నెలకొల్పడానికి కీలకం అవుతుంది. అందుకోసం నాలుగు దేశాల ఆలోచనలను పంచుకుంటాం. శాంతి కోసం పాటుపడాలన్నఆలోచనను మేం స్వాగతిస్తాం."
--స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
అయితే సమావేశం గురించి ఇంత వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు గత నెలలో వర్చువల్‌గా సమావేశమయ్యారు.
ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ నాలుగు దేశాలు కలిసి క్వాడ్(చతుర్భుజ)కూటమిగా ఏర్పడ్డాయి.
ఇదీ చూడండి: 'అగ్రరాజ్యంలో భారతీయ- అమెరికన్ల హవా'