ETV Bharat / international

'టీకా ధ్రువపత్రం ఉంటేనే రెస్టారెంట్​లోకి ఎంట్రీ' - రష్యా

డెల్టా విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్​లో రికార్డు స్థాయిలో 633 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో లాక్​డౌన్ విధించారు. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్​​ రెస్టారెంట్లలోకి ప్రవేశించాలంటే టీకా ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు.

coronavirus
డెల్టా వేరియంట్​
author img

By

Published : Aug 18, 2021, 4:09 PM IST

డెల్టా వేరియంట్​ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ రకం వైరస్​ ధాటికి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​ వేల్స్​ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 633 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో ముగ్గురు చనిపోగా మరణాల సంఖ్య 60కి చేరింది.

లాక్​డౌన్​లో రాష్ట్రం..

కేసుల పెరుగుదల నేపథ్యంలో జూన్​ 26 నుంచి సిడ్నీలో లాక్​డౌన్​ విధించగా, శనివారం నుంచి పూర్తి రాష్ట్రం నిర్బంధంలోకి వెళ్లింది.

టీకా ధ్రువపత్రం తప్పనిసరి..

డెల్టా​ ఉద్ధృతితో అమెరికాలో మంగళవారం ఒక్కరోజే 1,37,307 కేసులు వెలుగుచూశాయి. 873 మందికి పైగా మృతిచెందారు.

వైరస్​ను అదుపు చేయడంలో భాగంగా ప్రజలు టీకా వేసుకునేలా ప్రోత్సాహించడానికి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. న్యూయార్క్​లోని రెస్టారెంట్లు, మ్యూజియంలు, జిమ్​లలోకి ప్రవేశించాలంటే కనీసం ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించడం తప్పనిసరి చేశారు.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,46,112 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 9,920 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్త కేసులు ఇలా..

  • బ్రెజిల్-38,218
  • రష్యా-20,958
  • ఫ్రాన్స్​-28,114
  • యూకే-26,852
  • టర్కీ-21,692
  • ఇరాన్-50,228

ఇదీ చూడండి: లాంగ్​ కొవిడ్ సిండ్రోమ్​కు కారణమేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.