జూన్ 4న ఆస్ట్రేలియా, భారత ప్రధానుల మధ్య వీడియో సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి ముందు ఇద్దరు ప్రధానుల మధ్య ట్విట్టర్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్... మోదీ కోసం ఏకంగా సమోసాలు చేశారు. వాటితో కలిపి తినేందుకు మామిడి పచ్చడీ సిద్ధం చేశారు. ఆ వంటకాలతో దిగిన చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు మారిసన్.
'భారత ప్రధాని ప్రజాదారణ కలిగిన గొప్ప నాయకుడు. ఆయన శాకాహారి. ఆయనతో కలసి నోరూరించే సమోసాలను ఆస్వాదించాలి అనుకున్నాను. కానీ మా సమావేశం వీడియో లింక్ ద్వారా జరుగుతుంది.'
- స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
మారిసన్ ట్వీట్‌కు ఆసక్తికరంగా బదులిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.
'హిందు మహా సముద్రంతో అనుసంధానమైన భారత్, ఆస్ట్రేలియా దేశాలు.. భారతీయ సమోసాలతో ఒక్కటయ్యాయి. కొవిడ్-19 పై విజయం సాధించాక తప్పకుండా మీతో కలసి వీటిని తింటాను.'
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఇదీ చదవండి: పొగ రాయుళ్లలో 4 కోట్ల మంది 15 ఏళ్ల లోపువారే!