ETV Bharat / international

అఫ్గాన్​కు మరో వెయ్యి మంది అమెరికా జవాన్లు

5 killed in Kabul airport
అఫ్గాన్​లో ఉద్రిక్తత
author img

By

Published : Aug 16, 2021, 1:17 PM IST

Updated : Aug 16, 2021, 10:07 PM IST

22:05 August 16

మరో వెయ్యి మంది సైన్యం..

తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అమెరికా మరో వెయ్యి మంది సైనికులను ఆ దేశానికి పంపిస్తోంది. అఫ్గాన్​లోని తమ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు వీరిని పంపుతున్నట్లు తెలిపింది.

కాబుల్ ఎయిర్​పోర్ట్​ ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాయుధులకు అమెరికా దళాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆయుధాలు ధరించిన ఇద్దరిని అమెరికా సేనలు మట్టుబెట్టాయి. అనేక మంది అఫ్గాన్ పౌరులు సైతం ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న నేపథ్యంలో.. సిబ్బందిని విమానాశ్రయానికి తీసుకురావడమే కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.

21:44 August 16

కాబుల్ విమానాశ్రయంలో గందరగోళం.. కదలని విమానాలు

కాబుల్​ విమనాశ్రయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలోని అందులోని మిలిటరీ, పౌర విమానాలు ఎక్కిడికక్కడ నిలిచిపోయాయి. ఈ విషయాన్ని అమెరికా పెంటగాన్​ ఓ మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే ప్రజలు భారీస్థాయిలో విమానాశ్రయంలో గుమిగూడారు.

అంతకుముందు.. విమానాశ్రయంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇద్దరు సాయుధులను అమెరికా భద్రతాదళం మట్టుబెట్టినట్టు సమాచారం.

21:06 August 16

ఉగ్రవాదానికి ఉపయోగించకుండా...

అఫ్గానిస్థాన్ భూభాగాన్ని వేరే దేశాలపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ఉపయోగించకుండా చూడాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి.. ఉగ్రవాదం ఏరకంగా ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. కాబుల్ విమానాశ్రయంలో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలు భయాందోళనల్లో ఉన్నారని చెప్పారు. నగరంతో పాటు ఎయిర్​పోర్ట్​లోనూ కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

20:32 August 16

ఐరాస ఆందోళన

అఫ్గానిస్థాన్​లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. అంతర్గతంగా వేల మంది గల్లంతయ్యారని, పౌరులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఇతర దేశాలకు సూచించారు.

18:48 August 16

భారత్ స్పందన

అఫ్గాన్ సంక్షోభంపై భారత్ స్పందించింది. అఫ్గానిస్థాన్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారతీయులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

"గత కొద్దిరోజులుగా కాబుల్​లో పరిస్థితులు దిగజారుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అఫ్గాన్​లో ఉన్న కొందరు భారతీయులు తిరిగి రావాలని అనుకుంటున్న విషయం మాకు తెలుసు. వారితో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం."

-విదేశాంగ శాఖ ప్రకటన

18:45 August 16

బ్రిటన్ పార్లమెంట్ సమావేశం

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై చర్చించేందుకు బ్రిటన్ పార్లమెంట్ సమావేశం కానుంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు సమావేశమై చర్చించేందుకు అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హౌస్ ఆఫ్ కామన్స్(దిగువ సభ) పరిగణలోకి తీసుకుంది.

ఇప్పటికే ప్రధాని బోరిస్ జాన్సన్ అత్యవసర(కోబ్రా) సమావేశం నిర్వహించారు. అఫ్గాన్ సంక్షోభంపై సమీక్ష నిర్వహించారు.

17:20 August 16

తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్.. బానిసత్వపు సంకెళ్లు తెంచుకుందని అన్నారు. పాకిస్థాన్​లోని 1-5వ తరగతి పాఠశాలల్లో జాతీయ స్థాయిలో ఒకే పాఠ్యప్రణాళికను అమలు చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వల్ల విదేశీ సంస్కృతికి బానిసలుగా తయారవుతున్నామని అన్నారు.

'ఎప్పుడైతే ఇతరుల సంస్కృతిని అలవర్చుకుంటారో.. అప్పుడు దాన్ని మన సంస్కృతి కన్నా గొప్పదని భావిస్తారు. క్రమంగా దానికి బానిసలుగా మిగిలిపోతారు. ఈ విషయంలో అఫ్గానిస్థాన్ ప్రజలు బానిసత్వాన్ని జయించారు' అంటూ చెప్పుకొచ్చారు.

15:58 August 16

దేశం నుంచి బయటకు...

అఫ్గానిస్థాన్ నుంచి తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వచ్చే రెండు రోజుల్లో 1500 మంది ప్రజల్ని అఫ్గాన్ నుంచి తరలించనున్నట్లు యూకే తెలిపింది. తమ దేశానికి సహకరించిన అఫ్గాన్ పౌరులను సైతం తీసుకురానున్నట్లు వెల్లడించింది. స్వీడన్, పోర్చుగల్, ఆస్ట్రేలియా దేశాలు సైతం పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

కాగా, రాయబార కార్యాలయంలో పనిచేసే 70 మంది సిబ్బందిని ఇటలీ ఖాళీ చేయించింది. వారిని సురక్షితంగా రోమ్​కు తరలించింది. 

15:14 August 16

ట్విట్టర్ ఖాతా హ్యాక్

తమ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది. హ్యాక్​కు గురైన తర్వాత ఖాతా నుంచి అష్రఫ్ ఘనీకి వ్యతిరేకంగా పలు ట్వీట్లు వచ్చాయని వెల్లడించింది. 

14:43 August 16

స్నేహపుర్వకంగా చైనా 

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లతో 'స్నేహపూర్వక సంబంధాలు' అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధమని చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏఎఫ్​పీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. అఫ్గాన్​లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు. సీనియర్ రాజకీయవేత్త, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా సహా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. 

13:58 August 16

రష్యా చర్చలు.. 

  • ఆగస్టు 17న కాబూల్‌లో తాలిబన్లతో రష్యా రాయబారి చర్చలు
  • చర్చల తర్వాత తాలిబన్ల ప్రభుత్వ గుర్తింపుపై రష్యా నిర్ణయం
  • తాలిబన్ల వైఖరిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న రష్యా

13:57 August 16

పౌరుల తరలింపు.. 

  • అఫ్గాన్‌ నుంచి తమ పౌరులను తరలించేందుకు సిద్ధమైన పలు దేశాలు
  • అఫ్గాన్‌ నుంచి యూఏఈకి తమ పౌరులను తరలించనున్న ఫ్రాన్స్
  • భద్రతా బలగాల రక్షణతో పౌరులను తరలిస్తామన్న ఫ్రాన్స్
  • తమ పౌరుల తరలింపునకు దళాలను పంపనున్న జర్మనీ

13:52 August 16

విమాన సర్వీసులు బంద్..   

  • అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత, నిలిచిన విమాన సర్వీసులు
  • కాబూల్‌ విమానాశ్రయంలో విమానాలు నిలిపివేత
  • రద్దీని తగ్గించేందుకే విమానాలు నిలిపివేశామన్న అధికారులు
  • దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి పోటెత్తిన అఫ్గాన్‌ పౌరులు
  • నిన్నటి నుంచి కాబూల్‌ విమానాశ్రయంలో భారీ రద్దీ
  • అఫ్గాన్‌ మీదుగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విమానాలు దారి మళ్లింపు
  • తాలిబన్ల పాలనలోకి అఫ్గానిస్థాన్ వెళ్లటంతో దారి మళ్లింపు నిర్ణయం

13:11 August 16

అఫ్గాన్​లో ఉద్రిక్త పరిస్థితులు- పౌరులను తరలిస్తున్న దేశాలు

అఫ్గాన్​లో ఉద్రిక్తత

అఫ్గానిస్థాన్​లోని కాబూల్​ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేలాది మంది దేశాన్ని విడిచివెళ్లేందుకు.. తమ తమ విమానాల్లోకి ఎక్కేందుకు పరిగెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది. 

తాలిబన్లు వశం చేసుకున్న అఫ్గాన్​ను విడిచివెళ్లేందుకు పౌరులు విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. 

Last Updated : Aug 16, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.