పాకిస్థాన్ కరాచీ విశ్వవిద్యాలయం మస్కాన్కు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడులో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో 15మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పై సింధ్ ముఖ్యమంత్రి స్పందించారు. పేలుడుకు గల కారణాలపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
పోలీసులు మాత్రం ఇది కేవలం సిలిండర్ పేలుడుగా అంచనాకు వేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ పేలుడుతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు ఏ విధంగా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మరో పేలుడు..
నగరంలో మరో పేలుడు జరిగింది. షెరిన్ జిన్నా కాలనీ సమీపంలో బస్ స్టాండ్ ప్రవేశద్వారం వద్ద బాంబు పేలి ఐదుగురు గాయపడ్టారు. ఇది టెర్మినల్ గేట్ వద్ద ఉన్న ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడీ) ద్వారా సంభవించిందని పోలీసు వర్గాలు తెలిపాయి.