పాకిస్థాన్లో క్రమంగా లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్నారు. నేటి నుంచి ఐదు ప్రధాన విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులు పునః ప్రారంభించారు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కు చెందిన తొలి విమానం.. 84 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి లాహోర్ వెళ్లింది.
కరోనాతో పాక్లో శనివారం మరో 31 మంది మరణించారు. కొత్తగా 834 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 38 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.