మూడు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న భారత సైన్యాధిపతి ఎమ్ఎమ్ నరవాణే.. ఆ దేశ సైన్యాధ్యక్షుడు పూర్ణచంద్ర థాపతో భేటీ అయ్యారు.
"ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సమాలోచనలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల మధ్య ప్రస్తుతం ఉన్న మైత్రిని బలోపేతం చేసేందుకు నరవాణే-పూర్ణచంద్ర చర్చించారు."
-- నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ప్రకటన.
నేపాలీ ఆర్మీ చరిత్ర, అక్కడ ఉన్నవారి ప్రస్తుత బాధ్యతలను కూడా నరవాణేకు వివరించినట్టు ఆ ప్రకటన ద్వారా వెల్లడించింది పొరుగు దేశ సైన్యం.
సరిహద్దు వివాదంతో భారత్-నేపాల్ మధ్య మైత్రి ఇటీవలే బలహీనపడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యాధిపతి నేపాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:- నేపాల్‌లో భారత ఆర్మీ చీఫ్‌కు ఘనస్వాగతం