ETV Bharat / international

సరిహద్దు రక్షణకు రంగంలోకి ప్రధాని భార్య

ఆర్మేనియా-అజర్​బైజాన్​ల​ మధ్య ఉద్రిక్తతలకు తెరపడటం లేదు. తాజాగా తమ దేశ రక్షణ కోసం సరిహద్దులోకి వెళ్లి పోరాడతామని చెబుతున్నారు ఆర్మేనియా ప్రధానమంత్రి భార్య అన్నా హకోబ్యాన్​. 13 మంది మహిళలతో కలిసి సైనిక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.

author img

By

Published : Oct 29, 2020, 5:32 AM IST

Armenia PM's wife starts combat training to defend Karabakh border
యుద్ధశిక్షణలో ఆర్మేనియా ప్రధాన మంత్రి భార్య

ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్​ పాషిన్యాన్​ భార్య అన్నా హకోబ్యాన్​.. కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్​ సరిహద్దులో పోరాడేందుకు యుద్ధ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. తనతో పాటు 13 మంది మహిళలు ఇందులో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఫేస్​బుక్ ఖాతాలో సోమవారం ఓ పోస్ట్​ చేశారు.

"నాతో పాటు 13 మందితో కూడిన మహిళా బృందం.. సైనిక శిక్షణలో పాల్గొంటోంది. అక్టోబర్​ 27నుంచి ఈ శిక్షణ ప్రారంభమైంది. సరిహద్దులో పోరాడడానికి మేము కొద్ది రోజులు.. మా ఇళ్లను వీడుతున్నాం. ఆర్మేనియన్లు తమ జన్మభూమిని రక్షించడానికి చేసే తెగువ ఎలాంటిదో ప్రపంచానికి చూపే సమయం ఇది."

-- హకోబ్యాన్​, ఆర్మేనియా ప్రధాని భార్య

కొనసాగుతున్న దాడులు..

మరోవైపు.. అజర్​బైజాన్, అర్మేనియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీర్ఘశ్రేణి రాకెట్ల ద్వారా అజర్​బైజాన్ దళాలు నగరంపై దాడి చేశాయని నాగోర్నో కరాబాఖ్ అధికారులు తెలిపారు. రిపబ్లికన్ మెడికల్ సెంటర్ వద్ద జరిగిన ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఆస్పత్రిలోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఆరోపణలను అజర్​బైజాన్ రక్షణ మంత్రి ఖండించారు. అర్మేనియా దళాలే తమపై దాడి చేశాయని అన్నారు. ఇందుకు సంబంధించి వీడియోలను విడుదల చేశారు. సైనిక వాహనాలు ధ్వంసమైన దృశ్యాలు వీడియోలో నిక్షిప్తమయ్యాయి. అయితే ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయాలు అజర్​బైజాన్ వెల్లడించలేదు.

ఇదీ చూడండి:అజర్​బైజాన్​- ఆర్మీనియా రగడకు ఆ తప్పే కారణం!

ఇదీ చూడండి: అర్మేనియా- అజర్​బైజాన్ శాంతి ఒప్పందానికి తూట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.