ETV Bharat / international

కత్తితో బెదిరించి మరీ టాయ్​లెట్​ పేపర్​ చోరీ - hongkong toilet papers steal

హాంకాంగ్​లో కరోనా వైరస్​ ప్రభావం టాయ్​లెట్​ పేపర్​పై పడింది. తాజాగా కొంత మంది దుండగులు డెలివరీ బాయ్​ను కత్తితో బెదిరించి 130 డాలర్ల విలువైన టాయిలెట్​ పేపర్​ను ఎత్తుకెళ్లారు.

Armed gang steals toilet rolls as panic-buying hit Hong Kong
కత్తితో బెదిరించి మరీ టాయ్​లెట్​ పేపర్​ చోరీ
author img

By

Published : Feb 17, 2020, 11:22 AM IST

Updated : Mar 1, 2020, 2:38 PM IST

కరోనా... యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఆరోగ్యపరంగానే కాదు... ఆర్థికపరంగానూ పెను ప్రభావం చూపుతోంది ఆ మహమ్మారి. చైనాలో పరిశ్రమలు మూతపడి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. స్మార్ట్​ఫోన్ల ధరల పెరిగి, పెట్రోల ధరలు తగ్గవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థ చుట్టూ తిరుగుతుంటే... హాంకాంగ్​లో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ మిగిలిన అన్ని వస్తువులకన్నా టాయ్​లెట్​ పేపర్​కు ఎక్కువ డిమాండ్​ ఏర్పడింది. ఎంతలా అంటే... ఆయుధాలతో వచ్చిమరీ దోచుకెళ్లేంతగా.

కత్తులతో బెదిరించి...

హాంకాంగ్​లోని మాంగ్​ కాక్​ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఓ డెలివరీ బాయ్​ను కొంత మంది దుండగులు కత్తితో బెదిరించారు. కొన్ని పెట్టెల టాయ్​లెట్​ పేపర్​​ ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు 130 డాలర్లు.

సూపర్​ మార్కెట్​ సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయుధ దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ప్రభుత్వం భరోసా ఇచ్చినా...

కరోనాతో టాయ్​లెట్​ పేపర్​ సరఫరా​పై ప్రభావం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చినా... హాంకాంగ్ ప్రజలు నమ్మడం లేదు. దుకాణాల ముందు బారులు తీరి మరీ టాయ్​లెట్​ పేపర్​ కొనుగోలు చేస్తున్నారు. బియ్యం, పాస్తా వంటి సరుకుల్నీ పెద్దమొత్తంలో కొని, నిల్వ చేస్తున్నారు.

ఇదీ చూడండి:- 'క్రూయిజ్​షిప్'​లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

Last Updated : Mar 1, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.