ETV Bharat / international

ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?

క్రిమియా ప్రాంతంలో ఘర్షణల నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. సరిహద్దుల్లో రష్యా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తోంది. ఇందుకు పలు కారణాలను చెబుతోంది. అయితే ఈ పరిణామాలు ఇరు దేశాలకు మంచిది కావని ఉక్రెయిన్​ హెచ్చరిస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది​. కానీ రష్యా అందుకు సహకరించడం లేదని మండిపడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.

are-russia-and-ukraine-at-the-verge-of-war
ఆ రెండు దేశాల మధ్య 'యుద్ధ మేఘాలు'!
author img

By

Published : Apr 13, 2021, 6:26 PM IST

రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధమేఘాలు

రష్యా-ఉక్రెయిన్​ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. వేలాది మంది సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. వివాదాస్పద క్రిమియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి అక్కడ కాల్పుల మోత మోగుతోంది. కానీ బలగాలను పెంచుకోవాలన్న రష్యా అనూహ్య నిర్ణయంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో? అని ఇరు దేశాల ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రపంచదేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది?

వివాదం ఏంటి?

రష్యా- ఉక్రెయిన్​ మధ్య వివాదం 2014 నాటిది. నాడు.. ఇరు దేశాల సరిహద్దు భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యా మద్దతున్న వేర్పాటువాదులు- ఉక్రెయిన్​ బలగాల మధ్య అనేకమార్లు ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో దాదాపు 14వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా.

అయితే 2020లో ఇరు పక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి కొంత చల్లబడింది. కానీ ఈ ఏడాది తొలినాళ్లలో సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో బలగాల సంఖ్యను పెంచుతూ వస్తోంది రష్యా.

are-russia-and-ukraine-at-the-verge-of-war
సరిహద్దు ప్రాంతం

ఈ ఏడాది ఇప్పటివరకు 28 మంది ఉక్రెయిన్​ మిలిటరీ సిబ్బంది మరణించారు. తిరుగుబాటుదారుల్లోనూ అనేకమంది మృతిచెందారు.

ఉక్రెయిన్​ మాట...

రష్యా చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని ఉక్రెయిన్​ మండిపడుతోంది.

  • ఉత్తర-తూర్పు సరిహద్దులు, క్రిమియా ద్వీపకల్పం వెంబడి రష్యా భారీ సంఖ్యలో బలగాలను మోహరిస్తోంది.
  • ఇది ఇరు దేశాలకు మంచిది కాదని అంటోంది ఉక్రెయిన్.
  • పరిస్థితిని అదుపు చేసేందుకు మేము ప్రయత్నించాము. రష్యా అధ్యక్షుడు పుతిన్​తో సంభాషణ కోసం మార్చి 26న క్రెమ్లిన్​ను సంప్రదించాము. కానీ ఫలితం దక్కలేదు.

ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోడిమర్​ జెలెన్​స్కీ పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. సరిహద్దుల్లో ప్రయాణించి తమ దేశ బలగాలతో స్వయంగా మాట్లాడుతున్నారు. వారిలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఉక్రెయిన్​ అధ్యక్షుడు

జవాన్లతో ఉక్రెయిన్​ అధ్యక్షుడు

రష్యా వాదన..

సరిహద్దులో బలగాల సంఖ్యను పెంచడాన్ని రష్యా సమర్థించుకుంది.

  • క్రిమియాపై పట్టు సాధించేందుకు ఉక్రెయిన్​ తన బలగాలను ఉపయోగించే అవకాశముంది. దానిని అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నాం.
  • ఉక్రెయిన్​లో పౌర నిరసనలు పెరిగే అవకాశముంది. సరిహద్దు దేశమైన రష్యాకు ఇది మంచిది కాదు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని బలగాలను పెంచుతున్నాము.
  • తూర్పుపై పట్టు సాధించేందుకు మేము బలగాలను ఉపయోగిస్తే.. అది ఉక్రెయిన్​ వినాశనానికి ప్రారంభమవుతుంది.

దౌత్య మార్గాలు...

ఈ నెలలో జర్మనీ ఛాన్సెలర్​ ఏంజెలా మెర్కెల్- పుతిన్ మధ్య ఫోన్​లో సంభాషణ జరిగింది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్​ వ్యవహారాన్ని ప్రస్తావించారు మెర్కెల్​. ఉద్రిక్తతలను నియంత్రించేందుకు ప్రయత్నించాలని.. రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు.​

ఈ నెల 10న.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోడిమర్​ జెలెన్​స్కీ.. టర్కీ వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రష్యాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్​తో టర్కీ అధ్యక్షుడు అప్పటికే ఉక్రెయిన్​ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది.

అమెరికా హెచ్చరిక...

రష్యా-ఉక్రెయిన్​ వ్యవహారంపై అమెరికా ఘాటుగా స్పందించింది. తూర్పు ఉక్రెయిన్​లో ఉద్రిక్తతలను రష్యా పెంచుతోందని ఆరోపించింది. రష్యాపై తమ విధానాలను సమీక్షిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మిత్రపక్షాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది.

మరోవైపు రష్యా, టర్కీ, ఉక్రెయిన్​ మధ్యలో ఉన్న బ్లాక్​ సీకి రెండు యుద్ధనౌకలను పంపించింది అమెరికా. మే 4 వరకు అవి అక్కడే ఉంటాయని టర్కీ ప్రభుత్వానికి అగ్రరాజ్యం సమాచారం అందించింది.

మా ఇష్టం...

అయితే వీటిని రష్యా తిప్పికొట్టింది. తమ భూభాగంలో ఎక్కడైనా బలగాలను మోహరించే స్వేచ్ఛ తమకు ఉందని తేల్చిచెప్పింది. తూర్పులో నియంత్రణ రేఖ వెంబడి రష్యా బలగాలను ఉక్రెయిన్​ దళాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించింది.

ఇదీ చూడండి:- ఆయుధాల సరఫరాలో పాకిస్థాన్​కు రష్యా సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.