చైనాలో మరో ఉపద్రవం ఉనికి బయటపడింది! 'బుబోనిక్ ప్లేగు' వ్యాపించే ముప్పుందంటూ ఆ దేశంలోని ఓ నగరంలో అధికారవర్గాలు అప్రమత్తత ప్రకటించాయి. మంగోలియా ప్రాంతంలోని బయన్నూర్‌లో తాజాగా రెండు బుబోనిక్ ప్లేగు కేసులు బయటపడ్డాయి.
ఆ మాంసం తినడం వల్లే..
మర్మోట్ (ఒకరకం పందికొక్కు) మాంసం తినడం కారణంగా వారు ప్లేగు బారిన పడినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. వారిద్దరికీ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన 146 మందిని గుర్తించారు. మర్మోట్ మాంసం తినొద్దని ప్రజలను అధికారవర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాది ఆఖరి వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
ఇదీ చూడండి: నైట్‌క్లబ్‌లో కాల్పులు- ఇద్దరు మృతి