ఆస్ట్రేలియన్ స్వతంత్ర సెనేటర్ ఫ్రసెర్ అన్నింగ్పై ఓ యువకుడు గుడ్డుతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కెమెరాలో వీడియో తీస్తూ ఫ్రసెర్ తలపై గుడ్డు పగలగొట్టాడు. ఊహించని చర్యతో కోపోద్రిక్తులైన సెనేటర్ యవకుడిపై చేయి చేసుకున్నారు. అక్కడున్న వారిలో కొంత మంది యువకుడిపై దాడి చేసి ఒళ్లు హూనం చేశారు.
న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనకు ముస్లిం వలసలే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫ్రసెర్.
ఫ్రసెర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు సిగ్గుపడాలంటూ ఘాటుగా స్పందించారు.