చనిపోయాడని భావిస్తున్న అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ అకస్మాత్తుగా ఓ వీడియోలో ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై ఉగ్రదాడి జరిగి..20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌ఖైదా తన అధికారిక మీడియా అస్‌సహబ్ ద్వారా జేరూసలెంను యూధుల వశం కానివ్వబోం అన్న శీర్షికన ఈ వీడియోను శనివారం విడుదల చేసింది.
వీడియో కంటే ముందు.. జవహరీ రాసిన 852 పేజీల పుస్తకాన్ని సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 2021లో రాసి ఉంటారని జిహాదీ ముఠాల వ్యవహారాలను ట్రాక్‌చేసే 'సైట్' అనే ఇంటెలిజెన్స్‌సంస్థ వెల్లడించింది. అయితే.. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అధికారానికి సంబంధించి ఈ వీడియోలో ఎలాంటి ప్రస్తావన లేదని సైట్ తెలిపింది.
అలాగే జేరూసలెంను ఎప్పటికీ యూధుల వశం కానివ్వబోం అని కూడా వీడియోలో అన్నట్లు ఉందని పేర్కొంది. వీటిని బట్టి చూస్తే వీడియో తాజాగా రికార్డు చేసింది అయ్యుండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: తాలిబన్ల వింత రూల్స్: మహిళలు చదువుకోవచ్చు.. కానీ...