ETV Bharat / international

అఫ్గాన్​లో తాలిబన్లు వచ్చాక కశ్మీర్​లో పెరిగిన ఉగ్రవాదులు! - కశ్మీర్​లో ఉగ్రవాదులు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక జమ్ముకశ్మీర్​లో పాకిస్థాన్​కు చెందిన ముష్కరుల సంఖ్య పెరుగుతోందని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది. జులై నుంచి దాదాపు 50 మంది పాకిస్థాన్​ నుంచి కశ్మీర్​లోకి ప్రవేశించగా.. వారంతా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పింది.

pak based terrorists in jammu kashmir
జమ్ముకశ్మీర్ పాక్ ముష్కరులు
author img

By

Published : Oct 2, 2021, 10:53 AM IST

అఫ్గాన్​ పరిణామాలు.. పాకిస్థాన్​ ఉగ్రవాదులకు అండగా మారుతున్నాయా? భారత్​పై దాడులు చేసేందుకు వారు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత... పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదుల ఉనికి జమ్ముకశ్మీర్​లో అధికమైంది. 2019లో ఆర్టికల్​ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత ముష్కరుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా 'ఈయూ టుడే' తన కథనంలో తెలిపింది.

అందరూ క్రియాశీలకంగా..

పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​కు చెందిన ముష్కరులు చాలా మంది.. దేశంలోకి చొరబడుతున్నారని ఆ పత్రిక తన కథనంలో తెలిపింది. అఫ్గాన్​లోని హక్కానీ నెట్​వర్క్​తో ఈ ఉగ్రసంస్థలు కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. జులై నుంచి దాదాపు 50 మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించగా.. వారంతా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పింది. పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రం సహా సరిహద్దు ప్రాంతాల నుంచి వారు జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించారని పేర్కొంది.

దాడులకు ప్లాన్​?

'2018లో క్రియాశీలక ఉగ్రవాదుల సంఖ్య అధికంగా ఉంది. అయితే.. జమ్ముకశ్మీర్​కు కేంద్రం ప్రత్యేక హోదాను రద్దు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాక ఈ సంఖ్య తగ్గింది. కానీ, అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చిందని' ఆ కథనం తెలిపింది.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్​లోని తాలిబన్లకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు సహకరించలేదు. కానీ వాటి ప్రభావం మాత్రం ఉంది. ఇప్పుడు కశ్మీర్​లో ఈ రెండు ఉగ్రసంస్థలు ఉనికిని పెంచుకుంటున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.