ETV Bharat / international

Taliban news: తాలిబన్లపై అఫ్గాన్​ ప్రజల తిరుగుబాటు!

అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లకు(Taliban news) అఫ్గానిస్థాన్​ ప్రజల నుంచి ధిక్కార స్వరం ఎదురవుతోంది. స్వాతంత్య్ర దినాన జాతీయ పతాకంతో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా, అసదాబాద్‌లో కొందరు మృతి చెందారు.

Afghans protest
తాలిబన్లపై అఫ్గాన్​ ప్రజల తిరుగుబాటు
author img

By

Published : Aug 20, 2021, 7:05 AM IST

తుపాకీ నీడలో అఫ్గానిస్థాన్‌ను శాసించాలని చూస్తున్న తాలిబన్లకు (Taliban news) ధిక్కార స్వరం ఎదురవుతోంది. వారి అరాచక విధానాలపై క్రమంగా తిరుగుబాటు మొదలవుతోంది. అఫ్గాన్‌ స్వాతంత్య్ర దినమైన గురువారం రోజున దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనబాట పట్టారు. తాలిబన్‌ జెండాను దించేసి, జాతీయ పతాకాన్ని ఎగరేశారు. తమలోని ప్రజాస్వామ్య కాంక్షను చాటిచెప్పారు. జనం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత తాలిబన్లకు మింగుడు పడటం లేదు. ధిక్కార గళాన్ని ఆదిలోనే అణచివేసే ప్రయత్నాల్లో భాగంగా హింసకు తెగబడుతున్నారు. గురువారం వారు జరిపిన కాల్పుల్లో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. అసదాబాద్‌ నగరంలో కొందరు మృత్యువాతపడినట్లు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు- తాలిబన్లపై సాయుధ పోరాటానికి పంజ్‌షేర్‌ రాష్ట్రం కేంద్రంగా అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది.

Afghans protest
.

తాను దేశం వీడి వెళ్లడాన్ని అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సమర్థించుకున్నారు. రక్తపాతాన్ని నివారించేందుకు అదొక్కటే మార్గమని.. అందుకే కట్టుబట్టలు, జత చెప్పులతో తాను దేశాన్ని వీడినట్లు చెప్పారు. తాను కోట్ల రూపాయలు తీసుకొని దేశం వీడినట్లుగా వస్తున్న వార్తలను ఘనీ తోసిపుచ్చారు.

తాలిబన్లకు వ్యతిరేకంగా గురువారం కాబుల్‌ నగరంతో పాటు ఖోస్త్‌, నంగర్హర్‌, కునార్‌ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. పురుషులతో పాటు మహిళలూ అఫ్గాన్‌ జాతీయ పతాకాన్ని చేతబూని వీధుల్లోకి వచ్చారు. కాబుల్‌ విమానాశ్రయం సమీపంలో వందల మంది కార్లతో ర్యాలీ నిర్వహించారు. నంగర్హర్‌లో నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. అక్కడ పలువురు గాయపడ్డారు. రక్తమోడుతున్న ఓ వ్యక్తిని సహచరులు మోసుకెళ్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఖోస్త్‌లోనూ ఆందోళనకారులపై ముష్కర ముఠా సభ్యులు ఉక్కుపాదం మోపారు. ఇక్కడ 24 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. కునార్​లోని అసదాబాద్‌లో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారని వార్తలొస్తున్నాయి. మరోవైపు- కాబుల్‌ విమానాశ్రయం నుంచి మిలటరీ రవాణా విమానాల రాకపోకలు కొనసాగాయి. దేశం విడిచి వెళ్లడమే లక్ష్యంగా గురువారం కూడా వందల మంది అఫ్గానీలు విమానాశ్రయం వద్దకు వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్గాన్‌కు బ్రిటన్‌ నుంచి 1919 ఆగస్టు 19న స్వాతంత్య్రం సిద్ధించింది.

Afghans protest
.

పంజ్‌షేర్‌ కేంద్రంగా పంజా?

అఫ్గాన్‌లో ఇప్పటికీ తాలిబన్ల అధీనంలోకి రాని పంజ్‌షేర్‌ రాష్ట్రంలో దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. 'నార్తర్న్‌ కూటమి' పేరిట తాలిబన్లపై సాయుధ పోరాటానికి దిగేందుకు ఇక్కడ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్‌ ప్రకటించుకున్న సంగతి గమనార్హం.

పాలనకు ప్రత్యేక మండలి: తాలిబన్లు

అఫ్గాన్‌లో తమ హయాంలో ప్రజాస్వామ్యం ఉండబోదని తాలిబన్లు స్పష్టం చేశారు. ఒకప్పటి తరహాలోనే ప్రత్యేక మండలి ద్వారా పరిపాలన కొనసాగిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడబోయే తాలిబన్‌ సర్కారు ఎలాంటి విధానాలను అనుసరిస్తుందనేదానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ముఠా సీనియర్‌ నేత వహీదుల్లా హషీమీ ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో కీలక వివరాలు వెల్లడించారు. పరిపాలనాపరమైన విధానాలకు తాము తుదిరూపునిస్తున్నట్లు తెలిపారు. షరియా చట్టం ప్రకారం పాలన ఉంటుందన్నారు. రోజువారీ కార్యకలాపాలను ప్రత్యేక మండలి చూసుకుంటుందని.. దానిపై అత్యున్నత స్థాయి అధినేతగా తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా ఉంటారని తెలిపారు. 1996-2001 మధ్య కూడా తాలిబన్లు అఫ్గాన్‌ను ఇదే తరహాలో పరిపాలించారు. నాడు తాలిబన్‌ సుప్రీం లీడర్‌ ముల్లా ఒమర్‌.. మండలికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు.

పైలట్లు, సైనికులకు ఆహ్వానం

ఇన్నాళ్లూ అఫ్గాన్‌ ప్రభుత్వ హయాంలో పైలట్లు, సైనికులుగా విధులు నిర్వర్తించినవారంతా తమతో కలిసి పనిచేయాలని తాలిబన్లు కోరారు. ప్రభుత్వ బలగాలకు చెందిన అనేక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వారు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. వాటిని నడిపేందుకు పైలట్ల కోసం అన్వేషిస్తున్నారు.

మతపెద్దలతో నచ్చజెప్పే యత్నం

తమకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, దేశం విడిచి వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తుండటం తాలిబన్లను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మతపెద్దల ద్వారా జనానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశం వీడకుండా వారిని ఆపాలని మతపెద్దలను తాలిబన్లు కోరారు.

పిల్లలనైనా తీసుకెళ్లండంటూ వేడుకోలు

Afghans protest
.

తాలిబన్ల అరాచక పాలన నుంచి కనీసం తమ పిల్లలకైనా విముక్తి కల్పించేందుకు అఫ్గానీలు ఎంతగా తాపత్రయపడుతున్నారో తెలియజెప్పే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబుల్‌ను ముష్కరులు ఆక్రమించాక దేశం విడిచి వెళ్లేందుకు గత సోమవారం వేలమంది అఫ్గానీలు విమానాశ్రయానికి తరలివచ్చారు. వారిలో కొందరు లోపలికి ప్రవేశించలేక ఇనుప కంచెలకు బయటే ఉండిపోయారు. చంటిబిడ్డల తల్లులు కూడా అందులో ఉన్నారు. పిల్లలనైనా తాలిబన్ల నుంచి రక్షించుకోవాలని వారు భావించారు. తమ బిడ్డలనైనా దేశం నుంచి బయటకు తీసుకెళ్లాలని.. విమానాశ్రయం వద్ద కాపలాగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ దళాలను వేడుకున్నారు. కొందరైతే పిల్లల్ని ఇనుప కంచె పైనుంచి లోపలికి విసిరేసేందుకు ప్రయత్నించారు. ఆ పరిణామాలు తమను ఎంతగానో బాధించాయని బ్రిటన్‌ సైనికుడు ఒకరు తాజాగా వెల్లడించారు.

విమానం నుంచి పడిన వారిలో అఫ్గాన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు

Afghans protest
విమానం నుంచి పడిన అఫ్గాన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు

కల్లోలిత అఫ్గాన్‌ నుంచి బయటకు తరలిపోవాలనే తపనలో విమానంపైకి చేరుకుని, అది టేకాఫ్‌ అవుతున్నప్పుడు జారి కిందపడి మరణించినవారిలో యువ క్రీడాకారుడు జాకీ అన్వారీ కూడా ఉన్నారు. అఫ్గాన్‌ జాతీయ ఫుట్‌బాట్‌ జట్టులో అన్వారీ ఒక సభ్యుడు. సోమవారం నాటి ఘటనలో ఈ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు 'అఫ్గాన్‌ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ' డైరెక్టర్‌ జనరల్‌ దావూద్‌ మొరాడియన్‌ గురువారం ఐరాస భద్రత మండలికి తెలిపారు.

ఇదీ చూడండి: ఎటు చూసినా తుపాకులే... కాబుల్​లో ప్రస్తుత పరిస్థితి ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.