ETV Bharat / international

'తాలిబన్లు బలవంతంగా పాలన సాగించలేరు' - అఫ్గాన్​ ప్రభుత్వం

తాలిబన్లు బలవంతంగా అధికారాన్ని లాక్కున్నారని, ప్రజల హక్కులను గౌరవించకపోతే వారి ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని హెచ్చరించారు అఫ్గాన్​ నేతలు, ఉన్నతాధికారులు. బలవంతంగా పాలన చేయలేరని స్పష్టం చేశారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Taliban can't rule by force
తాలిబన్ల ప్రభుత్వం, అఫ్గానిస్థాన్​
author img

By

Published : Aug 20, 2021, 10:00 AM IST

Updated : Aug 20, 2021, 10:43 AM IST

అఫ్గానిస్థాన్​ను తమ హస్తగతం చేసుకుని దేశ పాలన దిశగా అడుగులు వేస్తున్నారు తాలిబన్లు. ఈ క్రమంలో అఫ్గాన్​ నేతలు, ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేస్తే తాలిబన్​ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని హెచ్చరించారు.

తాలిబన్లు కాబుల్​ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు సోమవారం అఫ్గాన్​ పార్లమెంట్​ స్పీకర్​ మిర్​ రెహ్మాన్​ రెహ్మానీ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్​కు చేరుకుంది. పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​తో సమావేశమయ్యారు. అనంతరం.. ఇస్లామాబాద్​లో బుధవారం విలేకరులతో మాట్లాడారు నేతలు, అధికారులు.

" అఫ్గాన్​లో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో అన్ని జాతుల భాగస్వామ్యం ఉండాలి. ఒకే పార్టీ, గ్రూప్​ నేతృత్వంలో పాలనను మేము వ్యతిరేకిస్తున్నాం. "

- మొహమ్మద్​ యూనిస్​ క్వనూనీ, అఫ్గాన్​ మాజీ ఉపాధ్యక్షుడు.

తాలిబన్లు బలవంతంగా పాలన చేయలేరని పేర్కొన్నారు ప్రముఖ రాజకీయ నేత ఖలిద్​ నూర్​. వాళ్లు బలవంతంగా అధికారాన్ని లాక్కున్నారని, ప్రజల హక్కులను గౌరవించకపోతే వారి పాలన చాలా తక్కువ సమయమే ఉంటుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​లో స్వేచ్ఛకు సంకెళ్లు.. మహిళల మెడపై 'షరియా' కత్తి

Last Updated : Aug 20, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.