ETV Bharat / international

తాలిబన్ రూల్స్​తో 'సినిమా' బంద్​- బాక్సాఫీస్​ సందడి ఇంకెప్పుడో?

దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన అరియానా థియేటర్ మూతపడింది. అమెరికన్ యాక్షన్ చిత్రాలు, బాలీవుడ్ సినిమా పోస్టర్లతో కళకళలాడే ఆ థియేటర్ ప్రస్తుతం వెలవెలబోతోంది. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్​లో సినిమా రంగంపై మొదలైన ఆంక్షల పర్వానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. షరియా చట్టాలను పక్కాగా అమలు చేస్తున్న తాలిబన్ల కఠిన నిబంధనలతో దేశంలోని ఎన్నో సినిమా థియేటర్లు, సాంస్కృతిక కేంద్రాలు మూతపడ్డాయి. దీనితో వందలాది మంది కార్మికుల భవిష్యత్ అంధకారంలో పడింది.

afgan cinema
అఫ్గాన్ సినిమా రంగం కుదేలు
author img

By

Published : Nov 11, 2021, 6:31 PM IST

అఫ్గాన్ సినిమారంగంపై తాలిబన్ల ఆంక్షలు

తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలోనూ అంతంత మాత్రంగానే ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ.. తాలిబన్ల రాకతో మరింత పతనావస్థకు చేరుకుంది. దీనికితోడు షరియా చట్టం పేరుతో తాలిబన్లు విధిస్తున్న కఠిన ఆంక్షలతో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌ వినోద రంగం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. సినిమాలు ప్రదర్శించకుండా థియేటర్లపై ముష్కర మూకలు విధించిన ఆంక్షలు.. థియేటర్‌ నిర్వహకులు, అందులోని ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేశాయి.

afgan cinema
అఫ్గాన్ సినిమారంగం
afgan cinema
వెలవెలబోతున్న అరియానా థియేటర్
afgan cinema
అఫ్గాన్ సినిమారంగం కుదేలు

ఓ వెలుగు వెలిగిన అరియానా..

ఒకప్పుడు కాబుల్ ప్రజల ప్రధాన వినోద కేంద్రంగా అరియానా సినిమా థియేటర్‌ ఓ వెలుగు వెలిగింది. అక్కడ విడుదలయ్యే మన బాలీవుడ్ సినిమాలు, అమెరికన్ యాక్షన్ చిత్రాలను చూసేందుకు ప్రజలు తరలివచ్చేవారు. దీంతో థియేటర్ లాభాల బాటలో నడవడటమే కాకుండా చాలా మందికి మంచి ఉపాధి లభించేది. ఇదంతా ఒకప్పటి కథ. తాలిబన్ల రాకతో అరియానా థియేటర్ తలరాత పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రద్దీగా ఉన్న థియేటర్‌లోని సీట్లన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. రోజుకు నాలుగు ఆటలను అలవోకగా ప్లే చేసే సినిమా ప్రొజెక్టర్‌ చూసే నాధుడు లేక మూగబోయింది.

afgan cinema
అఫ్గాన్ సినిమారంగంపై తాలిబన్ల ఆంక్షలు
afgan cinema
వెలవెలబోతున్న అరియానా థియేటర్
afgan cinema
సినిమా రంగం కార్మికుడి దీనావస్థ

భవిష్యత్ అగమ్యగోచరం..

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అమలు చేస్తున్న షరియా చట్టం వినోదాలకు పూర్తిగా వ్యతిరేకం. మరీ ముఖ్యంగా సినిమాలు చూడటం, నాటకాలు ప్రదర్శించటం వంటివి తాలిబన్ల చట్టాలు ఏ మాత్రం అంగీకరించవు. ఫలితంగా అరియానా సినిమాస్‌ లాంటి ఎన్నో థియేటర్లు కాబుల్‌ సహా అఫ్గాన్‌ వ్యాప్తంగా మూతపడ్డాయి. సినిమాలు ప్రదర్శించలేక ప్రేక్షకులు థియేటర్లకు రప్పించలేక నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబుల్‌లోని అరియానా థియేటర్‌లో మొత్తం 20 మంది పనిచేస్తుండగా ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సిబ్బంది వాపోతున్నారు.

afgan cinema
శిథిలమవుతున్న వైభవం
afgan cinema
ప్రేక్షకుల రాకకోసం
afgan cinema
అరియానా థియేటర్ తెర
afgan cinema
థియేటర్లు తెరుచుకునేదాకా నిరీక్షణ తప్పదు
afgan cinema
దీనంగా టికెట్లు చింపే వ్యక్తి

"మా పని ఇదే. ఇక్కడ దాదాపు 20 మంది పని చేస్తున్నారు. వారిప్పుడు ఏం చేసి బతకాలి? వారి భవితవ్యం తేలే వరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండక తప్పుదు."

--ఇనానుల్లా, థియేటర్‌ సిబ్బంది

"సినిమా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దేశంలో సినిమా లేకపోతే సంస్కృతి లేదు. ఈ సినిమా ద్వారా మేం ఐరోపా, అమెరికా, భారత్‌ వంటి ఇతర దేశాలను చూశాం."

--రహంతుల్లా, చీఫ్‌ ప్రొజెక్షనిస్ట్‌

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆ వెంటనే థియేటర్లలో సినిమాలు ప్రదర్శించకుండా ఆంక్షలు విధించినట్లు థియేటర్‌ నిర్వహకులు తెలిపారు.

ఉద్యోగం ఉంటుందా? లేదా?

కాబుల్‌ మున్సిపాలిటీకి చెందిన 'అరియానా సినిమాస్‌'లో విధులు నిర్వర్తించే వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. అయినప్పటికీ తమ భవితవ్యం తెలియక మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి జీతాలు రాక తమ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక మదనపడుతున్నారు.

afgan cinema
ఆంక్షలతో థియేటర్ మూసివేత
afgan cinema
అఫ్గాన్ సినిమా రంగంపై ఆంక్షలు
afgan cinema
అఫ్గాన్ సినిమా రంగం కుదేలు
afgan cinema
ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.