ETV Bharat / international

యాసిడ్‌ దాడికి పాల్పడితే 20ఏళ్లు జైలుశిక్ష - Nepal new ordinance

యాసిడ్‌ దాడులను అరికట్టేందుకు నేపాల్​ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎవరైనా యాసిడ్‌ దాడులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక మిలియన్‌ రూపాయల జరిమానా విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Acid attackers to face up to 20-year jail term in Nepal
యాసిడ్‌ దాడికి పాల్పడితే 20ఏళ్లు జైలుశిక్ష
author img

By

Published : Sep 28, 2020, 10:46 PM IST

యాసిడ్​ దాడులకు పాల్పడాలనుకునే వారి వెన్నులో వణుకు పుట్టించేలా నేపాల్‌ ప్రభుత్వం సరికొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎవరైనా యాసిడ్‌ దాడులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక మిలియన్‌ రూపాయల జరిమానా విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. యాసిడ్‌, ఇతర హానికర రసాయనాల విక్రయం, వినియోగం నియంత్రణపై నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి సోమవారం ఆర్డినెన్స్‌ జారీ చేశారు. దీని ప్రకారం యాసిడ్‌ దాడులకు పాల్పడేవాళ్లకు కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. ఇకపై యాసిడ్‌ అమ్మకం, విక్రయంపై లైసెన్స్‌ పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

గత కొన్నేళ్లుగా దేశంలో యాసిడ్‌ దాడులు పెరగడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని, మార్కెట్లో యాసిడ్‌ అమ్మకం, సరఫరాను నియంత్రించాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న చట్టానికి మరిన్ని నిబంధనలు చేరుస్తూ కొత్త ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించేలా మరింత కఠినంగా దీన్ని రూపొందించారు. ఇదివరకు ఉన్న చట్టం ప్రకారమైతే యాసిడ్‌ దాడులకు పాల్పడే వారికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష అమలులో ఉండేది.

ఇదీ చూడండి: పాక్​ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.