ETV Bharat / international

సైకోలా మారిన సైనికుడు- 20 మంది బలి - A Thailand soldier has killed at least 20 people in a shooting spree

థాయి​లాండ్​లో జవాను జరిపిన కాల్పుల ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని టెర్మినల్​ 21 షాపింగ్​ మాల్​లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడా దుండగుడు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూవివాదంతో విసుగు చెందిన ఆ జవాను.. ఈ చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

A Thailand soldier has killed at least 20 people in a shooting spree
సైకోలా మారిన సైనికుడు-20 మంది బలి
author img

By

Published : Feb 9, 2020, 5:30 AM IST

Updated : Feb 29, 2020, 5:15 PM IST

సైకోలా మారిన సైనికుడు- 20 మంది బలి

థాయి​లాండ్​లో ఓ సైనికుడు సైకోలా మారాడు. మిలటరీ క్యాంప్​, షాపింగ్​ మాల్​లో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయి​లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఏం జరిగిందంటే?

సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్​ మేజర్​ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్​ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్​కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్​ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్​ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్​ సెంటర్​లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తు బయటకు పరుగులు తీశారు. ఇక్కడ 17 మంది మరణించారు. తర్వాత దుండగుడు తన ఫేస్​బుక్​ ఖాతాలో దాడికి సంబంధించి పోస్టులు పెట్టాడు.

భూ వివాదమే కారణమా!

అయితే దుండగుడు ఇంకా షాపింగ్​ మాల్​లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. సాయుధుడు మాల్​లోనే ఎక్కడో తల దాచుకున్నట్లు సమాచారం. భవనంలో ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్న విషయంపైనా స్పష్టత లేదు. దాడికి ఎందుకు పాల్పడ్డాడో తెలియలేదు. అయితే భూ వివాదం కారణంగానే కోపోద్రిక్తుడైన జవాను కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల భయంతో షాపింగ్​ మాల్​లో తలదాచుకున్న ప్రజలందరినీ పోలీసులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రపంచంలో తుపాకీల వ్యాపారం జోరుగా సాగుతున్న దేశాల్లో థాయి​లాండ్ ఒకటి. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ సైనికాధికారి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు పాల్పడటం మాత్రం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి

ZCZC
PRI GEN INT
.BANGKOK FGN37
THAI-4THLD SHOOTING
Dozens evacuated from thai mall after gunman kills least 20 in mass shooting
         Bangkok, Feb 8 (AFP) Dozens of terrified shoppers were evacuated from a Thai mall early Sunday as armed police said they had "taken control" of the ground floor of the complex from a gunman who killed at least 20 people.
         But authorities did not give any firm details on the whereabouts of the attacker - a junior army officer named Sergeant-Major Jakrapanth Thomma.
         There were fears the shooter could try to hide amongst the panicked crowds.
         Police from the Crime Supression Division urged fleeing shoppers to "raise their hands" and identify themselves on the ground floor "and authorities will evacuate you".
         Earlier Jakrapanth relayed his shooting spree through Facebook posts which charted the attack from an army barracks to the mall where an unknown number of shoppers remained trapped.
         Hospitals across the country braced for a grim night ahead.
         "There are about 20 dead," Kongcheep Tantravanich, defence ministry spokesman said.
         "Police, military commandos and sharp shooters are surrounding Terminal 21," he said.
         The Thai Health Minister told reporters around 10 people were already in hospital in a "serious condition."
         The bloodshed began Saturday afternoon when Jakrapanth shot three people -- among them at least one soldier -- at an nearby army barracks.
         "He stole an army vehicle and drove into the town centre," police Lieutenant-Colonel Mongkol Kuptasiri.
         There the gunman used weapons stolen from the army arsenal to bring carnage to a town centre, walking into the Terminal 21 mall.
         He "used a machine gun and shot innocent victims resulting in many injured and dead," police spokesman Krissana Pattanacharoen said.
         Jakrapanth's motive remains unclear.
         But he throughout the day he posted images of himself and wrote several posts on his Facebook page as the attack unfolded including "should I surrender?" and "no one can escape death".
         In one Facebook video -- since deleted -- the assailant, wearing an army helmet, filmed from an open jeep saying, "I'm tired... I can't pull my finger anymore" and making a trigger symbol with his hand.
         There were also photos of a man in a ski mask holding up a pistol.
         A Facebook spokesperson said "we have removed the gunman's accounts from our services and will work around the clock to remove any violating content related to this attack as soon as we become aware of it".
         A witness who was inside the mall before the attack told AFP the shopping centre was thronging with shoppers on a long weekend.
         "There were loads of people at the mall today," a 32-year-old from the city said, requesting anonymity.
         "I was pretty shocked when I found out because I just left the mall not long before."
         Street lights below the shopping centre were switched off as army and police units sealed off the Terminal 21 mall.
         The city - better known as Korat - is home to one of Thailand's largest barracks in a country where the military is enmeshed in politics and society.
         Thailand has one of the highest rates of gun ownership in the world.
         Several shootings at courthouses late last year renewed concern about gun violence in the Southeast Asian country.
         In another high-profile case, a two-year-old boy was among three people killed in Thailand when a masked gunman robbed a jewellery shop last month.
         Late last year two lawyers were shot dead by a clerk at a court in the east of the country during a hearing over a land dispute. (AFP)
RUP
02082316
NNNN
Last Updated : Feb 29, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.