ETV Bharat / international

కంట్రోల్​ తప్పిన రాకెట్.. అస్తవ్యస్తంగా చక్కర్లు​.. మార్చిలో చంద్రుడ్ని ఢీ! - అడిలైడ్​

అంతరిక్షంలో ఓ రాకెట్​ కంట్రోల్​ తప్పి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తోంది. భూమి, చంద్రుడి చుట్టూ ఇష్టారీతిలో తిరుగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే అది జాబిల్లిని ఢీకొట్టనుందని ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్రవేత్త అంచనా వేశారు. గంటకు 9 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు.

A rogue rocket is on course to crash into the Moon
చంద్రుడిని ఢీకొట్టనున్న రాకెట్​
author img

By

Published : Jan 31, 2022, 5:26 PM IST

అంతరిక్షంలోకి 2015లో ప్రయోగించిన ఓ రాకెట్​ కంట్రోల్​ తప్పింది. అస్తవ్యస్తంగా పరిభ్రమిస్తూ మరికొద్ది వారాల్లో చంద్రుడిని ఢీకొట్టనుంది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్​ జాబిల్లివైపు వేగంగా దూసుకెళ్తున్నట్లు తెలిపారు ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్​ వర్సిటీలోని ఆర్కియాలజీ, స్పేస్​ స్టడీస్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ అలిస్​ గోర్మాన్. ప్రస్తుతం పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తున్న స్పేస్​ఎక్స్​ ఫాల్కన్​-9 రాకెట్​కు పైభాగాన ఈ రాకెట్ ఉందని.. భూమి, చంద్రుడి చుట్టూ ఇష్టమొచ్చినట్లు తిరగుతున్నట్లు తెలిపారు.

ఈ 4 టన్నుల బూస్టర్​ రాకెట్​ను ప్రయోగించిన నాటి నుంచి గ్రహశకలాలను పర్యవేక్షించే 'బిల్​ గ్రే' దానిని నిశితంగా పరిశీలిస్తోంది.

అదుపు తప్పిన బూస్టర్​ రాకెట్​ మార్చి 4న చంద్రుడిని ఢీకొట్టనుందని ఆర్బిట్​ ట్రాకింగ్​ సాఫ్ట్​వేర్​ బిల్​ గ్రే అంచనా వేసినట్లు పేర్కొన్నారు గోర్మాన్​. ప్రస్తుతం గంటకు 9 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ రాకెట్​ చంద్రుడి వైపునకు వెళ్తున్న క్రమంలో ఇష్టమొచ్చినట్లు కదులుతున్నందున.. అది ఏ సమయానికి, ఏ ప్రాంతంలో కూలిపోతుందనేది కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. అయితే.. చంద్రుడి చీకటి భాగంలో ఢీకొట్టే అవకాశం ఉందని, భూమిపై నుంచి కనిపించదని తెలిపారు.

మరోవైపు.. ఈ రాకెట్​ చంద్రుడిని ఢీకొట్టటం పెద్ద విషయమేమీ కాదని పేర్కొన్నారు పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు. అయితే, ఒక అంతరిక్ష పురావస్తు శాస్త్రవేత్తగా.. తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు అలిస్​ గోర్మాన్. ఈ రాకెట్​ చంద్రుడి చీకటి భాగంలో ఢీకొట్టటం వల్ల ఓ బిలం ఏర్పడుతుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఇలలో చైనా చందమామ- ఎన్ని ఉపయోగాలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.